పుష్ప 2 లో గెస్ట్ రోల్.. రంగంలోకి ఆ స్టార్ హీరో?
ఇక ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా కూడా మారిపోయాడు. ఇకపోతే ఇప్పుడు సినిమా కోసం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉంది. ఇక ఈ సినిమాలు అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది. ఇకపోతే ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
ఈ సినిమాలో ఒక స్పెషల్ గెస్ట్ రోల్ ఉండ బోతుంది అంటూ టాక్ వినిపిస్తుంది. ఇప్పటివరకు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అందరి పేర్లు వినిపించాయ్. ఇక ఇప్పుడు మరో స్టార్ హీరో పేరు గెస్ట్ రోల్ కోసం తెర మీదకి వచ్చింది అని చెప్పాలి. కోలీవుడ్లో స్టార్ హీరోగా కొనసాగుతున్న సూర్య పుష్ప 2 సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడట. ఇక సూర్య అల్లు అర్జున్ కు మధ్య ఉండే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయట. ఈ టాక్ నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. కానీ ఇది నిజమైతే బాగుండని ఐకానిక్ స్టార్ అభిమానులు కోరుకుంటున్నారు.