షాకింగ్.. భారీ నష్టాలతో అట్టర్ ప్లాప్ దిశగా 'బ్రో'?

Purushottham Vinay
ప్రతి స్టార్ హీరో సినిమాలకు కూడా మొదటి వారం వచ్చే కలెక్షన్సే చాలా ఇంపార్టెంట్ అనే విషయం అందరికి తెలిసిందే. పెద్ద పెద్ద నిర్మాతలందరు స్టార్ హీరోలు అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి, ఎంత కష్టమైనా వాళ్ళతోనే సినిమా చేయడానికి రెడీ అయ్యేది కేవలం మొదటి వారమే వాళ్ళు పెట్టిన మొత్తం బడ్జెట్ రికవరీ చేసి, ఆ తరువాత వచ్చే లాభాల కోసమే.అయితే అన్ని సార్లు కూడా అసలు అలా జరగదు. కొన్ని సార్లు తీవ్రం గా నష్ట పోవాల్సి కూడా వస్తుంది.ప్రస్తుతం బ్రో సినిమా పరిస్థితి కూడా అలాగే ఉంది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ఈ సినిమా జులై 28 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవర్ స్టార్ మ్యానియా తో మొదటి మూడు రోజులు ఒక మాదిరిగానే కలెక్ట్ చేసిన బ్రో సినిమా సోమవారం రోజుకి కంప్లిట్ గా డ్రాప్ అయిపోయింది. అసలు ఎంతగా పడిపోయిందంటే ఇటీవలే చిన్న సినిమాగా విడుదల అయ్యి సంచలన విజయం సాధించిన బేబీ సినిమా కంటే కూడా పవన్ కళ్యాణ్ బ్రో సినిమా అతి తక్కువ కలెక్ట్ చేసేంతల ఈ సినిమా పడిపోయింది.



కోలీవుడ్లో సూపర్ హిట్టైన వినోదయ సితం రీమేక్ గా తెరకెక్కిన బ్రో సినిమాపై ముందు నుంచే తక్కువ బజ్ అనేది ఉంది. దీనికి కారణం వరుసగా పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాలు చేయడమే. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన బ్రో సినిమాకు గాను పవన్ కళ్యాణ్ ఏకంగా 40 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు కలెక్షన్స్ వస్తాయి, ఆయన పేరు వినిపిస్తే చాలు డబ్బులు కుప్పలా కింద వచ్చి పడతాయి అని చెప్పే మాటలు ఒట్టి గాలి మాటలే అని బ్రో సినిమాతో మరోసారి రుజువైంది.రీసెంట్ గా రిలీజైన బేబీ సినిమా నాలుగవ రోజు 3.2 కోట్లు కలెక్ట్ చేయగా, బ్రో సినిమా కేవలం 2.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దీనిబట్టి చూస్తే స్టార్స్ నమ్ముకుని సినిమాలు తీసే కన్నా కంటెంట్ నమ్ముకొని సినిమాలు చేసింది మంచి పని అని తెలుస్తోంది. నిజానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ముందు నుంచి బ్రో సినిమా కంటే OG సినిమాపైనే ఎక్కువ నమ్మకంగా ఉన్నారు. మరి OG సినిమాతో అయిన పవన్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడో లేడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

BRO

సంబంధిత వార్తలు: