భోళా శంకర్ పై పెరిగిపోతున్న సందేహాలు !

Seetha Sailaja
చిరంజీవి మెహర్ రమేష్ ల  కాంబినేషన్  లో  నిర్మిస్తున్న ‘భోళాశంకర్’ మూవీ ఈనెల రెండవ వారంలో  స్వాతంత్ర  దినోత్సవ సందర్భంగా  వస్తున్న లాంగ్ వీకెండ్ ని టార్గెట్ చేస్తూ విడుదలకాబోతున్న విషయం తెలిసిందే. రెగ్యులర్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా భారీ కలెక్షన్స్ ను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతోంది ఈమూవీ.



‘భోళాశంకర్’ ట్రైలర్ మెగా అభిమానులకు  బాగా నచ్చినప్పటికి ఈమూవీ సగటు ప్రేక్షకులకు ఎంతవరకు నచ్చుతుంది అన్న సందేహాలు మెగా అభిమానులకు కూడ ఉన్నట్లు టాక్. ‘వేదాళం’ మూవీ రీమేక్ గా తీయబడిన ‘భోళా శంకర్’ మూవీని దర్శకుడు మెహర్ రమేష్ మళ్ళీ 11 ఏళ్ళ తర్వాత తీస్తున్నాడు. అయితే అతడు ప్రస్తుతం అతడు ఫ్లాప్ ల పర్వంలో ఉండటంతో  అతడి సామర్థ్యం పై మెగా  అభిమానులకు కూడ సందేహాలు ఉన్నాయి.    



ఇప్పటికే  రిలీజ్ అయిన ఈమూవీ ట్రైలర్ చూసిన చాలామంది మెగాస్టార్ తనకి అలవాటైన క్యారెక్టర్ లోనే కనిపిస్తున్నాడు కాని అందులో వెరైటీ ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. దీనికితోడు ఈమూవీలో కొన్ని చోట్ల కామెడీ కోసం పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ రాజశేఖర్ లను చిరంజీవి లాంటి  ట్రెండ్ సెట్టర్ అనుకరించడం ఏమిటి అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనికితోడు చిరంజీవి ఈ సినిమాలో తనకు  అలవాటులేని తెలంగాణ స్లాంగ్ ను ట్రై చేయడం అంతగా ఎవరికీ నచ్చలేదు.



ఈ సినిమా ట్రైలర్ చూసిన చాలామంది యాక్షన్ కామెడీ రొమాన్స్ సెంటిమెంట్ లను కలిపిన  సగటు సినిమాగా మాత్రమే ఈమూవీ మారే ఆస్కారం ఉంది అంటున్నారు. ఈసినిమాకు   మణిశర్మ తనయుడు మహత్ స్వర సాగర్ సంగీతం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అతడు ట్యూన్ చేసిన పాటలు అంత క్యాచీగ లేవు అన్న కామెంట్స్ వస్తున్నాయి. దీనితో అన్ని విషయాలలోనూ ఎవరేజ్ గా కనిపిస్తున్న ఈ మూవీ కేవలం సిస్టర్ సెంటిమెంట్ ను నమ్ముకుని ఎంతవరకు సక్సస్  అవుతుంది అంటూ మెగా అభిమానులకు కూడా లోలోపల సందేహాలు ఉన్నట్లు తెలుస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: