టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ నటుడు ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఆఖరుగా ఈ నటుడు ది వారియర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లింగు సామి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకో లేక పోయింది.
ఇకపోతే ప్రస్తుతం ఈ యువ నటుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న "స్కంద" అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్వహిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తూ ఉండగా ... ఈ సినిమాను ఈ సంవత్సరం సెప్టెంబర్ 15 వ తేదీన థియేటర్ లలో తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పాడుతూ ఉండడంతో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా లోని మొదటి పాటను విడుదల చేయబోతున్నారు.
ఈ మూవీ లోని మొదటి పాటను ఈరోజు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ఈ మూవీ మేకర్స్ విడుదల చేయనున్నారు. ఈ సాంగ్ ను ఒకే సమయంలో తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.