సీఎం బయోపిక్.. ప్రధాన పాత్రలో విజయ్ సేతుపతి?
అయితే ఇక ఇలాంటి జీవిత కథ ఆధారంగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు అటు సూపర్ హిట్ లు కూడా సాధిస్తూ ఉండడం గమనార్హం. అయితే ఇప్పటికే అటు రాజకీయ నాయకులకు సంబంధించి ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా సినిమాలు వచ్చాయి. ఇక ఇప్పుడు మరో ముఖ్యమంత్రి జీవితకథ సినిమాగా మారేందుకు సిద్ధమవుతుంది అన్నది తెలుస్తోంది.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బయోపిక్ ని తెరకెక్కించబోతున్నారట. అయితే ఈ సినిమాలో ప్రధానపాత్రలో స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక సామాన్యుడు సీఎం ఎలా అయ్యాడు.. అతని రాజకీయ జీవితం ఎలా సాగుతూ వచ్చింది.. ఇక ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు అనే అంశాలను ఈ సినిమాలో చూపించబోతున్నారట. ఈ క్రమంలోనే లీడర్ రామయ్య పేరుతో ఈ బయోపిక్ రెండు పార్ట్ లుగా రాబోతుంది అని సమాచారం. కేవలం తమిళ్ మలయాళం భాషల్లో మాత్రమే కాదు.. తెలుగులో కూడా ఈ బయోపిక్ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంటుంది.