స్కంద నుంచి హై వోల్టేజ్ ఎనర్జీ సాంగ్..!!
ఎలాగైనా ఈసారి సక్సెస్ అందుకోవాలని బోయపాటి దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో హీరోయిన్ గా శ్రీ లీల నటిస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది రిలీజ్ దగ్గర పడుతూ ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తోంది తాజాగా స్కంద మూవీ నుంచి మొదటి సాంగును రిలీజ్ చేయడం జరిగింది.. నీ చుట్టూ చుట్టూ అంటూ సాగే సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది ఈ పాటను సిద్ శ్రీరామ్ అలరించారు.
ఈ సాంగును రామజోగయ శాస్త్రి రచించారు. ఈ పాట ప్రేక్షకులను బాగా నే ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది ఈ సాంగ్‌లో రామ్ శ్రీలీల చాలా ఎనర్జిటిక్ తో డాన్స్ వేసినట్లుగా తెలుస్తోంది. ఈ సాంగ్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా చేశారు మాస్ మసాలా కంటెంట్‌తో తెరకెక్కిస్తున్న స్కందా సినిమా పైన భారీగా అంచనాలు నెలకొన్నాయి ఈసారి ఈ సినిమాతో రామ్ పోతినేని తన మార్క్ చూపించాలని సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో కలిసి డబుల్ ఇస్మార్ట్ అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే విడుదల చేయడం జరుగుతోంది.