పరువు పోగొట్టుకున్న 'బేబీ' హీరోయిన్ వైష్ణవి...!!

murali krishna
మామూలుగా సెలబ్రిటీలు బయట కనిపించినప్పుడు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతుంటాయి. వారితో సెల్ఫీలు దిగాలని వారితో మాట్లాడాలని తెగ తాపత్రయపడుతూ ఉంటారు.అయితే కొన్ని కొన్ని సార్లు ఆ అత్సుత్సాహంతో సెలబ్రిటీలకు ఇబ్బంది కలిగించే విధంగా మాట్లాడడం, ప్రవర్తించడం లాంటివి చేస్తుంటారు. సెలబ్రిటీలు బయట కనిపించినప్పుడు ప్రేక్షకాభిమానుల తాకిడి తట్టుకోవడం కష్టం. అలాగే మూవీస్ కి సంబందించిన ఈవెంట్‌లో ఆడియన్స్‌లో ఎవరితోనైనా మాట్లాడాలన్న కూడా కష్టం.

ఎందుకంటె వాళ్లు ఏమడుగుతారోనని టెన్షన్. తాజాగా బేబి మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్యకి ఇలాంటి వింత పరిస్థితి ఎదురైంది.తాజా గా మెగా సెలబ్రేషన్స్ పేరు తో ఒక ఈవెంట్ ఏర్పాటు చేశారు. అప్పుడు టీం ఫ్యాన్స్, ఆడియన్స్‌తో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆనంద్ దేవరకొండ ఫ్యాన్ అయిన ఒక కుర్రాడు మాట్లాడుతూ.. విరాజ్ అశ్విన్ చేసిన క్యారెక్టర్ తనకు బాగా కనెక్ట్ అయ్యిందని, రియల్ లైఫ్‌లో తనది కూడా అలాంటి క్యారెక్టరేనని, అమ్మాయిలు ఎందుకు మోసం చేస్తున్నారో అర్థం కావట్లేదని అన్నాడు.ఆ మాటలకు విరాజ్ నవ్వుకున్నాడు. ఆ తరువాత ఆ కుర్రాడు ఊహించని విధంగా వైష్ణవి చైతన్యపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.మేడమ్ మిమ్మల్ని చూస్తే మా లవరే గుర్తొచ్చింది. సెకండ్ లవర్.. టెన్త్‌లో ఒకటి, ఇంటర్‌లో మరోటి రెండు లవ్ స్టోరీస్ ఉన్నాయని చెప్పాడు.

మీరు మోసం చేసినట్లే నా పోరి నన్ను మోసం చేసింది అనగానే.. ఆ మాటకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక షాక్ అయింది వైష్ణవి. దాంతో వెంటనే యాంకర్ స్పందిస్తూ అది సినిమా లో క్యారెక్టర్ మాత్రమే అంటూ అక్కడితో కట్ చేసింది. మొత్తానికి ఆ కుర్రాడు తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడిన వైష్ణవి చైతన్యను అందరిలో అవమానించే విధంగానే మాట్లాడాడు. ఆ కుర్రాడు మాట్లాడిన మాటలకు కూడా ఆమె షాక్ అయ్యి బాధ పడినట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: