ఆ మూవీలో అవకాశం కోసం భగవంతుడిని వేడుకున్న బాలీవుడ్ బ్యూటీ....!!
ఇలా ఒక వైపు బాలీవుడ్ సినిమాలలో మరోవైపు దేవర సినిమా షూటింగ్లో పాల్గొంటూ కెరియర్ పరంగా జాన్వీ కపూర్ ఎంతో బిజీ గా గడుపుతున్నారు. ఇకపోతే తాజాగా ఈమె దేవర సినిమాలో నటించడం కోసం తాను ఎంతగా ఆరాటపడ్డాననే విషయాన్ని వెల్లడించారు.ఈ సందర్భంగా జాన్వీ కపూర్ బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ తో కలిసి అభిమానులతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగే ప్రశ్నలకు వీరిద్దరూ సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ దేవర సినిమా గురించి ఈమెను ప్రశ్నించారు.
ఈ సందర్భంగా జాన్వీ కపూర్ దేవర సినిమా గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం లో ఈ సినిమాని ప్రకటించిన సమయం నుంచి ఎలాగైనా ఈ సినిమాలో తనకు అవకాశం కల్పించేలా చూడాలని భగవంతుడిని ప్రార్థించాను.ఈ విధంగా ఏడాది పాటు ఈ సినిమాలో అవకాశం తనకే రావాలని భగవంతుడిని ప్రార్థించాను.చివరికి ఈ సినిమాలో తానే హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యానని, నా కోరిక నెరవేరిందని ఈమె తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో తాను ఎంతో బిజీగా ఉన్నానని ఈ సందర్భంగా జాన్వీ కపూర్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.