ఉస్తాద్ లో శ్రీ లీల కాకుండా మరొక హీరోయిన్ కూడా..!!
ఇందులో మరొక హీరోయిన్ మహిళా ప్రధాన పాత్ర కోసం మరొక హీరోయిన్ కూడా ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి సోమవారం రోజున అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమాతో పాటు సుజిత్ దర్శకత్వంలో రాబోతున్న OG సినిమాని కూడా రిలీజ్ డేట్ గురించి పలు రకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటికే సగం వరకు పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్.. ఉస్తాద్ సినిమా కంటే ముందుగా థియేటర్లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ డేట్లు కూడా సినిమాలకు అడ్జస్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.ఒకవేళ ఈ రెండు సినిమాలు అనుకున్న సమయానికి సిద్ధం అయితే రెండు నెలల గ్యాప్ వ్యవధిలోనే ఈ సినిమాలు థియేటర్లో సందడి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకేసారి ఐదు నెలల లోనే రెండు సినిమాల షూటింగ్ ఎలా పూర్తి అవుతుందంటూ అభిమానులు తెలియజేస్తున్నారు.మరి పవన్ కళ్యాణ్ పొలిటికల్ పరంగా కూడా బిజీ అవ్వడం చేత ఏ సినిమాని పూర్తిగా చేసి విడుదల చేస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. మరి త్వరలోనే ఈ సినిమాల పైన చిత్ర బృందాలు అప్డేట్ ఇస్తారేమో చూడాలి మరి.