మహేష్ పుట్టినరోజునాడు ఏమి జరుగుతుంది !

Seetha Sailaja
వచ్చేవారం ఆగష్టు 8న మహేష్ పుట్టినరోజు జరగబోతోంది. అయితే ఈసారి ఈ పుట్టినరోజు హంగామా ఎలా ఉండబోతోంది అన్న ఆశక్తి ఇండస్ట్రీ వర్గాలతో పాటు మహేష్ అభిమానులలో కూడ చాల ఎక్కువగా కనిపిస్తోంది. మహేష్ త్రివిక్రమ్ ల ‘గుంటూరు కారం’ మూవీకి సంబంధించిన ఒక ట్రైలర్ ను ఆరోజున విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈమూవీ వచ్చే సంవత్సరం సంక్రాంతి రేస్ లో ఉంటుందని ఇప్పటికే ఒక ప్రకటన వచ్చింది.



అయితే ఈమూవీ షూటింగ్ రకరకాల కారణాలతో ఆలస్యం అవుతున్న పరిస్థితులలో ఈమూవీ వచ్చే సంక్రాంతికి కాకుండా వచ్చే సమ్మర్ కు విడుదల అవుతుంది అని అంటున్నారు. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్ ను బట్టి ఈమూవీలో మహేష్ పక్కా మాస్  హీరోగా కనిపిస్తాడని క్లారిటీ వచ్చింది. అయితే త్రివిక్రమ్ మాస్ సినిమాలు తీసే విషయంలో అంత నేర్పరితనం ఇప్పటివరకు కనపరచని పరిస్థితులలో ఎంతవరకు ఈ ప్రయత్నంలో త్రివిక్రమ్ సక్సస్ అవుతాడు అన్న భయాలు మహేష్ అభిమానులలో ఉన్నాయి.



ఈవిషయం ఇలా కొనసాగుతూ ఉండగా మహేష్ పుట్టినరోజునాడు రాజమౌళి మహేష్ తో తీయబోతున్న మూవీకి సంబంధించిన అధికార ప్రకటనతో పాటు ఈమూవీ టైటిల్ ను కూడ ప్రకటిస్తారని అంటున్నారు. పాన్ వరల్డ్ మూవీగా నిర్మాణం జరుపుకోబోయే ఈమూవీ బడ్జెట్ రాజమౌళి సినిమాల బడ్జెట్ లోనే అత్యధికం అని ప్రచారం జరుగుతోంది.



దీనితో మహేష్ పుట్టినరోజునాడు రాజమౌళి అధికారక ప్రకటన ఉంటే అందరి దృష్టి ‘గుంటూరు కారం’ పై కంటే మహేష్ రాజమౌళిల మూవీ ప్రాజెక్ట్ పై ఉంటుంది అన్న అంచనాలు కూడ ఉన్నాయి. ఇప్పటికే ‘బ్రో’ సినిమా వివాదాలలో అనవసరంగా త్రివిక్రమ్ చిక్కుకున్నాడు అన్న అభిప్రాయం కొందరికి ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ‘గుంటూరు కారం’ ఘనవిజయం త్రివిక్రమ్ కు చాల అవసరం. దీనితో మహేష్ పుట్టినరోజునాడు ఈమూవీ ట్రైలర్ ఆలోచన చేశస్తున్నారు. ఇప్పుడు మధ్యలో రాజమౌళి ప్రకటన వస్తే ‘గుంటూరు కారం’ పరిస్థితి ఎలా అంటూ కొందరి కామెంట్స్..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: