మోహన్ లాల్ పృధ్విరాజ్ సుకుమారన్ ప్రధానోపాత్రలో వచ్చిన మలయాళ సినిమా బ్రో డాడీ సినిమా గత ఏడాది ఏడాది భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మోహన్లాల్ మరియు పృధ్విరాజ్ తండ్రి కొడుకుల పాత్రలో కనిపించడం మనం చూసాం. ఇక పృద్విరాజ్య సుకుమారం దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫ్యామిలీ అండ్ కామెడీ డ్రామాగా వచ్చింది. అయితే ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే .అయితే మోహన్లాల్ పాత్రను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పోషించబోతున్నట్లుగా తెలుస్తోంది.
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. మోహన్లాల్ మరియు పృధ్వీరాజ్ సుకుమార్ అండ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాని తెలుగులో కూడా రీమేక్ చేయడానికి రెడీ అయ్యారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే అసలు విషయం ఏంటంటే తాజాగా అందుతున్న సమాచారం మేరకు టాలీవుడ్ యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్న శర్వానందును ఈ సినిమాలో చిరంజీవికి కొడుకు పాత్ర కోసం ఎంపిక చేశారు అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
కాగా ఈనెల 22న చిరంజీవి పుట్టినరోజు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మేకర్స్ వెల్లడించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో త్రిష మరియు శ్రీ లీల హీరోయిన్లుగా నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఈ సినిమా కథలో కొన్ని మార్పులు కూడా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో చిరంజీవి మరియు శర్వానంద్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మొట్టమొదటి సినిమా కోసం అటు చిరంజీవి మరియు శర్వానంద్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!