టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే నాని మరియు కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో స్క్రీన్ చేసుకోబోతున్నారు అన్న వార్త గత కొంతకాలం నుండి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే జైలర్స్ నిమ్మ తరువాత రజనీకాంత్ జ్ఞానవెల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు. రజనీకాంత్ 170 సినిమా కావడంతో తలైవార్ 170 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా ప్రారంభం కాబోతుందని అంటున్నారు. అయితే ఈ సినిమాకి అనిరుద్ సంగీతాన్ని అందించబోతున్నారట.
మరికొద్ది రోజుల్లో ఈ సినిమాకి వెళ్లబోతుండడంతో నాని ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారని అంటున్నారు. ఇప్పటికే మేకర్స్ నానిని ఇందుకోసం సంప్రదించారట. క్యారెక్టర్ నచ్చడంతో వెంటనే నాని సైతం ఇందుకు ఓకే చేసినట్లుగా తెలుస్తోంది. కథను మలుపు తిప్పే పాత్రలో ఈ సినిమాలో నాని కనిపించబోతారట. ఈ సినిమాలో దాదాపు 20 నిమిషాలకు పైగానే నాని కనిపించబోతున్నాడని తెలుస్తోంది. అయితే మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. రజనీకాంత్ సినిమాకి నాని ఊహించిన తీసుకుంటున్నారట.
20 నిమిషాల పాత్ర కోసం నాని ఏకంగా 10 కోట్లు డిమాండ్ చేశాడన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే నాని గత సినిమా దసరా పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా తరువాత నానే మార్కెట్ భారీగా పెరిగింది. అందుకే ఈ సినిమాకి 10 కోట్ల వరకు డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది .ఇక అందుకు తలైవా 170 మేకర్స్ సైతం ఒప్పుకున్నారట. ఏదేమైనాప్పటికీ 20 నిమిషాల పాత్ర కోసం 10 కోట్లు నాని డిమాండ్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది..!!