గేమ్ చేంజర్ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసిన కీయరా..!!
ఇప్పటికే రెండేళ్లుగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది ఈ ఏడాది చివరి కల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తి కాబోతోందని కియారా తెలియజేయడం జరిగింది. రామ్ చరణ్ తన ప్రియమైన మిత్రుడని తన నుంచి నేర్చుకోవాల్సింది చాలానే ఉందని తెలియజేయడం జరిగింది. సినిమా బాగా షేప్ అయ్యింది ఊహకు అందని ట్రీట్ సిల్వర్ స్క్రీన్ పైన ఎవరు చూడని అనుభూతి చూస్తారంటూ కియారా అద్వాని తెలియజేయడం జరిగింది. ఈ సినిమా కోసం మా చెమటలు దారు కోసం రక్తం చిందించామని కాస్త ఎమోషనల్ టచ్ లో కూడా తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ. మెగా అభిమానులకు ఈ వార్త వినగానే కాస్త సంతోషాన్ని తెలియజేస్తున్నారు.
2023-24 సీజన్ మోస్ట్ అవైడడ్ చిత్రంలో గేమ్ చేంజర్ సినిమా కూడా ఒకటని చెప్పవచ్చు. ఇక డైరెక్టర్ కూడా భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కిస్తూ ఉంటారు. శంకర్ క్రియేటివిటీ గురించి గత చిత్రాలను చూస్తే మనకు అర్థమవుతుంది.. రూ.400 కోట్ల రూపాయలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నటీనటులు కూడా భారీగా ఉండడంతో పాటు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు కూడా ఈ చిత్రానికి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రం అన్ని భాషలలో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం.