టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్న గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ప్రస్తుతం తమన్నా ఒకేసారి రెండు బడా సినిమాల్లో ఇద్దరు బడా హీరోల సినిమాల్లో నటిస్తోంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ రెండు సినిమాలు కూడా ఒకేసారి విడుదల కాబోతున్నాయి. ఇక నేపథ్యంలోనే తమన్న వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది. కాగా ఇటీవల ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఒక నటిగా నా కల నిజమైనట్టుంది. రజినీకాంత్ చిరంజీవి వంటి ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి ఒకేసారి అటు తమిళం ఇటు తెలుగు ప్రేక్షకుల్ని కూడా అందించడం గొప్ప అనుభూతిని కలిగిస్తోందని చెప్పుకొచ్చింది.
అయితే ప్రస్తుతం తమన్న రజినీకాంత్ తో మరియు చిరంజీవితో భోళాశంకర్ వంటి సినిమాల్లో నటిస్తోంది. కాగా ఈ రెండు సినిమాలు కూడా ఈనెల 10 మరియు 11వ తేదీల్లో విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం తమన్న మీడియాతో ముచ్చటించింది సైరాలో నాకు చిరంజీవితో కలిసి నటించే అవకాశం దొరికింది. కానీ డాన్స్ మాత్రం చేయలేకపోయానుమ్ కానీ ఇప్పుడు మాత్రం భోళాశంకర్ సినిమాలో అది నెరవేరింది. జైలర్స్ సినిమా విషయానికి వస్తే అందులో కూడా నా పాత్ర చిన్నది. కానీ భారీ తారాగణముంది.
ఇక నా 18 ఏళ్ల వస్తే నీ ప్రయాణంలో ఇటు అగ్ర హీరోలతోనూ అటు ఇవ్వు హీరోలతోనూ అందరితో కలిసి సినిమాలను చేశాను. ఇక నేను ఎవరితో కలిసి పనిచేసిన వారి వయసు ఎప్పుడు దృష్టిలో పెట్టుకొని అందరినీ నటులుగానే భావిస్తాను. మేము చేసే పాత్రలో ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటాయా లేదా అన్నది మేము ఆలోచిస్తాము. ఇక పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు నేను ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడేస్తూ ఉంటాను. ప్రేమ విషయాన్ని నాకు నేనుగా బయటపెట్టా అలాగే పెళ్లి సమయం వచ్చినప్పుడు ఆ విషయాన్ని కూడా నేనే స్వయంగా మీ అందరితో పంచుకుంటాను. ఇప్పటికైతే అలాంటి ఆలోచనలు మాత్రం లేవు. అంటూ ఈ సందర్భంగా తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది తమన్నా..!!