గేమ్ చేంజర్: వామ్మో పాటలకి అన్ని కోట్ల బడ్జెటా?

Purushottham Vinay
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమాలంటే ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తుంటారో తెలిసిందే. ఆయన సినిమాలకు మార్కెట్ లో కూడా అదేస్థాయిలో డిమాండ్ ఉంటుంది.జనాలు కోరుకునే అంశాలను తనదైన శైలిలో వెండితెరపై ప్రజెంట్ చేస్తుంటారు. ఇక శంకర్ సినిమా అంటే సాంగ్స్ కూడా ఒక రేంజ్ లో ఉంటాయి. వాటి షూటింగ్ కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది. 'ఒకే ఒక్కడు' నుంచి 'రోబో', 'ఐ' వంటి సినిమాల వరకు సాంగ్స్ రిచ్ గా ఉండేలా చూశారు. భారీ సెట్స్ లో షూట్ చేసి ప్రేక్షకులకు కొత్త ఎక్స్ పీరియెన్స్ ను అందించారు.ఇక ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో శంకర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 'గేమ్ ఛేంజర్' అనే టైటిల్ తో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్, కొన్ని లీకైన వీడియోలతో కూడా సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామంటూ ఫ్యాన్స్, ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ కొంచెం వాయిదా పడింది.



 'భారతీయుడు 2' షూట్ పై శంకర్ ఫుల్ గా ఫోకస్ పెట్టడంతో కొద్దిగా షూట్ పూర్తయ్యే సరికి ఇంకాస్తా సమయం పట్టనుంది.అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. సినిమాలోని పాటల కోసమే ఏకంగా రూ.90 కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. గ్రాండియర్ గా, చాలా అద్భుతమైన విజువల్స్ తో సాంగ్స్ ను రూపొందిస్తున్నారంట. అంతపెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారంటే ఇంకా అవుట్ పుట్ కూడా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.అలాగే మరోవైపు శంకర్ ప్రొడ్యూసర్ దిల్ రాజును సాంగ్స్ కోసం ఒప్పించి మరీ అంతా ఖర్చు చేయిస్తున్నారని సమాచారం. దీంతో సినిమాపై చాలా ఆసక్తి పెరిగింది.'గేమ్ ఛేంజర్' మూవీలో మొత్తం ఐదు సాంగ్స్ ఉంటాయని సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గతంలోనే చెప్పిన విషయం తెలిసిందే. ప్రతి సాంగ్ కూడా నెక్ట్స్ లెవల్లో ఉంటుందని హామీనిచ్చారు. ప్రస్తుతం థమన్ ట్రెండే కొనసాగుతుండటంతో ఈ సినిమాకూ అదిరిపోయే ట్యూన్స్ కూడా ఇస్తారని మ్యూజిక్ లవర్స్ నమ్ముతున్నారు. అలాగే టాప్ కొరియోగ్రాఫర్లు ప్రభుదేవా, జానీ మాస్టర్, ప్రేమ్ రక్షిత్, ఇంకా గణేశ్ మాస్టర్స్ ఒక్కో సాంగ్ కు కొరియోగ్రఫీ అందించారని తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: