ప్రస్తుతం ఓటీటీలో కూడా బోలెడన్ని మంచి సినిమాలు/వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతున్నాయి.ఇక అందులో ‘దయా’ వెబ్ సిరీస్ కూడా ఒకటి. చాలా ఏళ్ల తర్వాత సీనియర్ హీరో జేడీ చక్రవర్తి నుండి వచ్చిన ప్రాజెక్ట్ ఇది. అలాగే చక్రవర్తి నటించిన మొదటి వెబ్ సిరీస్ కూడా ఇదే. ‘సేనాపతి’ వంటి క్రేజీ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ పవన్ సాధినేని ఈ సిరీస్ కి డైరెక్షన్ చేశాడు. దీంతో ప్రేక్షకుల దృష్టి ఈ సిరీస్ పై పడింది. హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషల్లో కూడా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది.మొత్తం 8 ఎపిసోడ్స్ గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కాబోతుంది. మరి ప్రేక్షకులను ఈ సిరీస్ ఎంత వరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం.
కథ విషయానికి వస్తే..దయా (జేడీ చక్రవర్తి) ఓ వ్యాన్ డ్రైవర్. ఫిష్ ట్రాన్స్‌పోర్ట్ చేసే ఫ్రీజర్ వ్యాన్ కి జేడి డ్రైవర్ అనమాట. ఆయన భార్య అలివేలు (ఈషా రెబ్బా) తో హ్యాపీగా జీవిస్తూ ఉంటాడు. ఆమె ఒక నిండు గర్భిణీ. అయితే ఎప్పటిలాగానే ఓ రోజు పని మీదకి వెళ్ళిన దయా ఊహించని విధంగా ఓ ప్రమాదానికి గురవుతాడు. ఆ టైంలో ఆయన బండిలో డెడ్ బాడీ ఉంటుంది.అసలు అది ఎలా వచ్చి చేరింది? ఇంతకీ ఆ డెడ్ బాడీ ఎవరిది?అసలు జర్నలిస్ట్ కవిత (రమ్యా నంబీసన్) కథేంటి? ఆమె అసలు హైదరాబాద్ నుండీ కాకినాడ పోర్టుకు ఎందుకు వచ్చింది? మధ్యలో ఈ షబానా (విష్ణుప్రియ) ఎందుకు ఎంట్రీ ఇచ్చింది? వంటి ట్విస్ట్ లతో దయా సిరీస్ ను రూపొందించాడు దర్శకుడు. అవి తెలియాలంటే ఖచ్చితంగా సిరీస్ చూడాల్సిందే.
ఈ దయ సిరీస్ కి కచ్చితంగా సూపర్ రెస్పాన్స్ అందుతుంది అనడంలో సందేహం లేదు.ఒక వెబ్ సిరీస్ అంటే కేవలం క్లాస్ గానే ఉంటుంది అనే అభిప్రాయాన్ని దయా చెరిపేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇక రైటింగ్ అయితే చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది. నేపథ్య సంగీతం కూడా సిరీస్ కి ప్రాణం పోసింది .శ్రవణ్ భరద్వాజ్ కి ఖచ్చితంగా ప్రశంసలు దక్కుతాయి. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. సీజన్ 2 కోసం ఇచ్చిన లీడ్స్ కూడా ఎంతగానో ఆకట్టుకుంటాయి. అయితే స్టార్టింగ్ ఎపిసోడ్స్ కొంచెం స్లోగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఒక్కసారి ఆ వరల్డ్ లోకి వెళ్ళాక అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు.