ఆ హీరో కెరీర్ నాశనం అవ్వడానికి కారణం అదేనా....!!

murali krishna
హీరో ఆర్యన్ రాజేష్ పరిచయం అవసరం లేని పేరు. ఇప్పటి తరం వారికి ఈయన పెద్దగా తెలియకపోయినా కానీ ఒకానొక సమయం లో వరుస సినిమా లలో నటిస్తూ ఆర్యన్ రాజేష్ పెద్ద ఎత్తున ప్రేక్షకులను మెప్పించారు.ఆర్యన్ రాజేష్ ప్రముఖ దర్శకుడు ఇవివి సత్యనారాయణ కుమారుడు గా ఇండస్ట్రీ కి పరిచయమయ్యారు.ఈ విధం గా ఒకానొక సమయం లో ఇండస్ట్రీలో హీరో గా ఎంతో బిజీ గా ఉన్నటువంటి ఆర్యన్ రాజేష్ అనంతరం నటిస్తున్న సినిమాలన్నీ కూడా వరుస గా ఫెయిల్యూర్ కావడం తో ఈయన సినిమా ఇండస్ట్రీ కి దూరమయ్యారు.
ఇలా సినిమా ఇండస్ట్రీ కి దూరం గా ఉన్నటువంటి ఆర్యన్ రాజేష్ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. బోయపాటి శ్రీను దర్శకత్వం లో రామ్ చరణ్ హీరో గా నటించిన వినయ విధేయ రామ సినిమా లో రామ్ చరణ్ కు అన్న పాత్ర లో నటించారు. అయితే ఈ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాకపోవడం తో ఈయనకు ఇతర సినిమా అవకాశాలు రాలేదని తెలుస్తుంది. దీంతో ఈయన పూర్తిగా ఇండస్ట్రీ కి దూరమయ్యారని తెలుస్తుంది.
అయితే తన తండ్రి ఈవివి సత్యనారాయణ గారు బ్రతికున్నంత కాలం ఈయన వరుస సక్సెస్ సినిమా లలో నటించారు. అయితే ఆయన మరణాంతరం ఆర్యన్ రాజేష్ హీరో గా పెద్దగా మెప్పించలేకపోయారు.తన తండ్రి బ్రతికే ఉన్న సమయం లో ఆర్యన్ రాజేష్ సినిమా కథల ఎంపిక విషయం లో తన తండ్రి పాత్ర కీలకం గా ఉండేదని తెలుస్తోంది. రాజేష్ తండ్రి గారు మరణించిన తర్వాత కథల ఎంపిక విషయం లో ఈయన సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతోనే ఇలా వరుసగా ఫెయిల్యూర్ తనని వెంటాడాయని ఇదే తన కెరియర్ ను నాశనం చేసిందని తెలుస్తుంది. అయితే సినిమా లలో వరుస ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్నటువంటి ఈయన ప్రొడక్షన్ రంగం వైపు అడుగులు వేస్తున్నారనీ తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: