శెట్టి మౌనంలో వెనుక అర్ధాలు !
అయితే రకరకాల కారణాలతో ఈమూవీ విడుదల అనేకసార్లు వాయిదా పడి ఈనెల మొదటి వారంలో వస్తుంది అన్న ప్రకటన కూడ చేశారు. అయితే ఈమూవీకి సంబంధించిన గ్రాఫిక్ వర్క్స్ పూర్తి అవ్వకపోవడంతో ఈ మూవీని మరొకసారి వాయిదా వేయడంతో ఈమూవీ పై ఏర్పడిన పాజిటివ్ వైబ్రేషన్స్ నెమ్మదిగా తగ్గి ఈమూవీ గురించి సగటు ప్రేక్షకుడు మరిచిపోయే ఆస్కారం ఉంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఆమధ్య ఈసినిమా ఆగష్టు మూడవ వారంలో విడుదల అవుతుంది అన్న లీకులు వచ్చాయి. అయితే ఈమూవీ నిర్మాతలు అయిన యువీ క్రియేషన్స్ ఆలోచనలలో ఈసినిమా విడుదలకు సంబంధించి ఆగష్టు మూడవ వారం రిలీజ్ డేట్ లేదు అని అంటున్నారు. ఇది ఇలా ఉండగా నవీన్ పోలిశెట్టి తెలుగు రాష్ట్రాలలోని కొన్ని కాలేజీలకు వెళ్ళి ఈసినిమాను ప్రమోట్ చేస్తున్నారు.
అయితే రిలీజ్ డేట్ స్పష్టంగా క్లారిటీ లేని ఈసినిమాకు నవీన్ పోలిశెట్టి ప్రమోషన్ వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ మరికొందరు ఆశ్చర్యపోతున్నారు. ఈసినిమా విడుదల తేదీ పై స్పష్టమైన క్లారిటీ లేకపోయినప్పటికీ ఈమూవీకి సంబంధించిన ప్రమోషన్ కొన్ని ఛానల్స్ కు సంబంధించిన టివి షోలలో ప్రమోట్ చేస్తున్న నపధ్యంలో ఈమూవీ విడుదల తేదీ పై ఎందుకు సస్పెన్స్ కొనసాగిస్తున్నారు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈమూవీ అనుష్క నటించే ఆఖరి సినిమాగా మారే ఆస్కారం ఉంది అంటూ మరొక గాసిప్ హడావిడి చేస్తోంది..