బన్నీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 'పుష్ప 2' నుండి క్రేజీ అప్డేట్..!?

Anilkumar
టాలీవుడ్ సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమాల్లో పుష్ప సినిమా కూడా ఒకటి. లెక్కలు మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా గురించి అల్లు అర్జున్ అభిమానులతో పాటు సినీ ఆడియన్స్ సైతం ఎప్పటినుండో ఎదురు చూస్తున్నారు. అల్లు అర్జున్ పుష్పరాజ్ గా మరోసారి టైటిల్ రోల్లో అదరగొట్టేందుకు రెడీగా ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమాకి సంబంధించిన కొత్త అప్డేట్స్ ఏమీ కూడా రాలేదు. దీంతో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక కొత్త అప్డేట్ ఇప్పుడు తెరపైకి వచ్చింది అని అంటున్నారు. 

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లో స్టార్ట్ అయింది అని తెలుస్తుంది. అల్లు అర్జున్ తో పాటు కీలక నటులపై వచ్చే కొన్ని సన్నివేశాలను కూడా ఈ షెడ్యూల్లో చిత్రీకరించబోతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా  సమాచారం మేరకు సీక్వెల్లో ఫాహాద్ ఫజిల్ మెయిన్ విలన్ గా కనిపిస్తారట. క్యూరియాసిటీ పెంచేలా పార్ట్ వన్ కు శుభం కార్డ్ వేసాడు సుకుమార్. దాంతో పార్ట్ 2 లో ఎలా చూపించబోతున్నాడు అన్నది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది.

అయితే 'పుష్ప2' ఫుల్ ఫుల్ లెన్త్ ఎలివేషన్ తో కొనసాగుతుందని ఇందులో ఎనిమిది యాక్షన్స్ సన్నివేశాలు ఉంటాయి అన్న సమాచారం కూడా వినిపిస్తోంది. అయితే సీక్వెల్లో ప్రత్యేకించి అల్లు అర్జున్ మరియు ఫహద్ ఫాసిల్ ల మధ్య వచ్చే నాలుగు యాక్షన్స్  మరియు జగపతిబాబుతో వచ్చే ఒక యాక్షన్ సీన్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుందని కూడా అంటున్నారు. ఇకపోతే ఈ యాక్షన్ సీక్వెన్స్ ను హాలీవుడ్కు చెందిన టీం పర్యవేక్షణలో షూట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఇక సీక్వెల్ కోసం రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ నుండి ఫస్ట్ పార్ట్ మించిపోయేలా మరొక చార్ట్ బస్టర్ ఆల్బమ్ కూడా సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా మైత్రి మూవీ మీకు బ్యానర్ పై భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: