నాగబాబు గూర్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నటి....!!
అన్నయ్యా ఒక ఫోటో అని చెప్పి చిరంజీవితో కలిసి ఫోటో దిగానని ప్రభావతి పేర్కొన్నారు. బేబీ మూవీ చూసి మా అమ్మ హగ్ ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు. ఓ అమ్మ కథ సీరియల్ టైటిల్ రోల్ లో నేను చేశానని ప్రభావతి చెప్పుకొచ్చారు. బేబీ మూవీ రోల్ ఛాలెంజింగ్ రోల్ అని కథ విన్న సమయంలోనే మూవీ సక్సెస్ అవుతుందని తెలుసని ప్రభావతి పేర్కొన్నారు. నన్ను చాలామంది సహజనటి అని పిలుస్తారని ప్రభావతి వెల్లడించారు. మహానటి, గుడ్ లక్ సఖి సినిమాలలో కీర్తితో కలిసి చేశానని ఆమె అమ్మ అని పిలిచేవారని ఆమె పేర్కొన్నారు.
ఐతే బేబీ మూవీలో నాగబాబు గారి పాత్ర ఎంతో నచ్చిందని ఆ పాత్రను చూస్తుంటే మా నాన్నగారు గుర్తొచ్చారని ప్రభావతి వెల్లడించారు. మా నాన్న ఉన్న సమయంలో అలానే ఉండేవారని అనిపించిందని ప్రభావతి పేర్కొన్నారు. ప్రతి ఇంటికి బేబీ సినిమాలోని నాగబాబు పాత్ర లాంటి తండ్రి కావాలని ఆమె చెప్పుకొచ్చారు. బేబీ సినిమాలో ఎవరి పాత్రకు వాళ్లు న్యాయం చేశారని ప్రభావతి అన్నారు. 150కు పైగా సినిమాలలో నేను నటించానని ఆమె చెప్పుకొచ్చారు.
ఒక చిన్న సినిమాగా విడుదల ఐ మంచి సక్సెస్ రేట్ తో ఇండస్ట్రీలోనే చిరస్థాయిగా ఈ మూవీ నిల్చిపోతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ మూవీ తో హీరోయిన్ కి మంచి పేరు వచ్చిందని ఐతే ఆమెకు ఇంకా ఆఫర్స్ వరుసగా వస్తాయని మేకర్స్ భావిస్తున్నారు.