ఆ మాస్ డైరెక్టర్ తో విశ్వక్ సేన్ సినిమా.. ఇక ఊర మాసేనా?
ఈ నగరానికి ఏమైంది అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులు అందరికీ బాగా దగ్గరైన విశ్వక్సేన్.. ఫలక్నుమా దాస్ సినిమాతో డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా హీరోగా తనను తాను నిలబెట్టుకునేందుకు సినిమా చేశాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఇక అతని కెరియర్ సాఫీగా సాగడం మొదలైంది. అయితే ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నా అటు విశ్వక్సేన్ కి మాత్రం ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అని చెప్పాలి. అయితే మొన్నటికి మొన్న దాస్కా దమ్ కి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన.. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకాదరనకు నోచుకోలేదు. ఇక ఇప్పుడు గ్యాంగ్ ఆఫ్ గోదావరి అనే సినిమాను చేస్తున్నాడు.
ఇలాంటి సమయంలో ఇక ఒక స్టార్ డైరెక్టర్ తో విశ్వక్సేన్ పనిచేయబోతున్నట్లు ఒక వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో కాదు పూరి జగన్నాథ్. ప్రస్తుతం పూరి రామ్ తో డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నాడు. ఇది ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాకు సీక్వెల్. ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు సీక్వెల్ పై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా తర్వాత యంగ్ హీరో విశ్వక్సేన్ తోనే పూరి జగన్నాథ్ మూవీ ఉండబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయ్. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే అఫీషియల్ ప్రకటన రావాల్సిందే.