మెగాస్టార్
చిరంజీవి పోయిన సంవత్సరం ఆచార్య ...
గాడ్ ఫాదర్ మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ
మూవీ లలో ఆచార్య
మూవీ ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహపరచగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన
గాడ్ ఫాదర్ మూవీ ప్రేక్షకులను పర్వాలేదు అనే రేంజ్ లో అలరించింది. ఇకపోతే ఈ సంవత్సరం
చిరంజీవి "వాల్టేరు వీరయ్య" అనే పక్కా కమర్షియల్
మాస్ ఎంటర్టైనర్
మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇకపోతే ఈ సంవత్సరం
చిరంజీవి "భోళా శంకర్" అనే మరో కమర్షియల్ ఎంటర్టైనర్
మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ
మూవీ ఆగస్టు 11 వ తేదీన
థియేటర్ లలో విడుదల కానుంది.
మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మిల్కీ
బ్యూటీ తమన్నా
హీరోయిన్ గా నటించగా ...
కీర్తి సురేష్ ...
సుశాంత్ ఈ
మూవీ లో కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
మహతీ స్వర సాగర్ ఈ
మూవీ కి సంగీతం అందించగా ... ఈ సినిమాని
అనిల్ సుంకర నిర్మించాడు. ఇకపోతే ఈ
సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ
మూవీ బృందం ఈ
సినిమా నుండి అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది. ఇక తాజాగా ఈ
మూవీ బృందం ఈ
సినిమా నుండి "కొట్టరా కొట్టు తీన్మార్" అంటూ సాగే సాంగ్ ను విడుదల చేసింది. ఈ సాంగ్ కి ప్రేక్షకుల నుండి డీసెంట్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇకపోతే ఇప్పటికే ఈ
మూవీ కి సంబంధించిన టికెట్ బుకింగ్ లను ఈ
మూవీ మేకర్స్ ఓపెన్ చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. మరి ఈ
మూవీ కి మంచి టాక్ కనుక వచ్చినట్లు అయితే భారీ ఓపెనింగ్ లు లభించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. మరి ఈ
మూవీ ఎలాంటి టాక్ ను తెచ్చుకుంటుందో ... ఏ రోజు ఓపెనింగ్ లను తెచ్చుకుంటుందో చూడాలి.