బండ్ల గణేష్ స్థానాన్ని ఆక్రమించిన హైపర్ ఆది !

Seetha Sailaja
‘భోళాశంకర్’ ప్రీ రిలీజ్ఈవెంట్లో హైపర్ ఆది స్పీచ్ విన్న చాలమంది  అతడు బండ్ల గణేష్ స్థానాన్ని ఆక్రమించబోతున్నాడు అంటూ  కామెంట్స్ చేస్తున్నారు. ఆమధ్య పవన్ కళ్యాణ్ ను ఆకాశంలోకి  ఎత్తేసిన  ఈ జబర్దస్త్ స్టార్ ఈసారి తన వంతుగా చిరంజీవిని ఎంచుకున్నాడు.  



చిరంజీవి కెరీర్ ప్రారంభంలో జరిగిన అవమానాలతో మొదలుపెట్టి కోటి రూపాయల పారితోషికాన్ని తీసుకున్న తొలి హీరో స్థాయికి ఎదిగిన  సందర్భాన్ని ప్రస్తావిస్తూ ‘ఘరానా మొగుడు’ సాధించిన సంచలనాలు  రామ్ చరణ్ నటన గురించి వచ్చిన విమర్శలకు ‘రంగస్థలం’ తో ఇచ్చిన సమాధానం లాంటి ఎన్నో మెగా హీరోల ఘన విజయాలను తెలియ చేస్తుంటే ఆడిటోరియం చప్పట్లతో దద్దరిల్లి పోయింది.



ఇదే సందర్భంలో మరొక అడుగు ముందుకు వేసిన హైపర్ ఆది ‘ఠాగూర్’ సినిమాలో చిరంజీవి తనకు నచ్చని పదం క్షమించడం అని అన్న సందర్భాన్ని వివరిస్తూ నిజ జీవితంలో చిరంజీవి ఎందరీనో  క్షమించడమే పనిగా పెట్టుకున్నాడని అనడంతో మరొకసారి మెగా అభిమానుల చప్పట్లు ఈలలతో  శిల్ప కళా వేదిక దద్దరిల్లిపోయింది. హైపర్ ఆది  మరొక అడుగు ముందుకు వేసి చిరంజీవి ఎదుర్కున్న అవమానాలకు త్వరలో పవన్ కళ్యాణ్ లెక్క సరిచేయబోతున్నాడు అంటూ ఆది అనగానే భావోద్వేగానికి చిరంజీవి లోనవ్వడం మీడియా కెమెరాలకు స్పష్టంగా కనిపించింది.



ఆది మాట్లాడుతున్నంత సేపు మెగా అభిమానుల ఉత్సాహం ఒక రేంజ్ లో కనిపించింది. కేవలం మెగా అభిమానులు మాత్రమే కాకుండా ఈ కార్యక్రమానికి వచ్చిన అతిధులు కూడ ఆది స్పీచ్ ని ఎంజాయ్ చేయడం ఆ ఫంక్షన్ కు హైలెట్ గా మారింది. త్వరలో ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే ఎన్నికలలో హైపర్ ఆది ‘జనసేన’ తరపున పోటీ చేస్తాడు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఆది చేసిన ఈ మెగా భజనకు రాబోతున్న ఎన్నికలకు సంబంధం ఉందా అన్న ఆశక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఏమైనా బండ్ల గణేష్ స్థానాన్ని హైపర్ ఆది ఆక్రమించుకోవడం ఖాయం అని అనిపిస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: