ఎట్టకేలకు తన గ్లామర్ సీక్రెట్ రివీల్ చేసిన మెగాస్టార్..!?

Anilkumar
ఆరు పదుల వయసులో కూడా మెగాస్టార్ చిరంజీవి ఎంత అందంగా కనిపిస్తారో మనందరికీ తెలిసిందే. అంతే అందంగా అదిరిపోయే స్టెప్పుల నువ్వు వేస్తూ షాక్ ఇస్తూ ఉంటారు మెగాస్టార్. వయసుతో పాటు చిరంజీవి క్రేజ్ మరియు పాపులారిటీ కూడా ఆయన వయస్సు లాగే అంతకంతకు పెరిగిపోతుంది. ఇక క్లింకారా బారసాల ఫంక్షన్ లో కుర్ర హీరోలు సైతం కుళ్ళుకునేంత అందంగా కనిపించారు మెగాస్టార్. అనంతరం భోళా శంకర సినిమాలో చిరంజీవి లుక్ కిల్లింగ్ గా ఉన్నాయి అంటూ చాలామంది కామెంట్స్ చేస్తూ ఉండడం మనం చూసే వింటాం.

అయితే తన ఫేసులో మెరుపు వెనక ఉన్న సీక్రెట్ ఏంటో భోళాశంకర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తెలియజేశారు చిరంజీవి. ఇక ఆడియన్స్ లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు అని ఆడియన్స్ తర్వాత ప్రొడ్యూసర్లు దర్శకుల కు ప్రాధాన్యత ఇస్తానని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. నా దృష్టిలో ఆడియన్స్ కు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది అని చెప్పారు. తాను ఫైట్ చేసిన సీన్ చేసిన సాంగ్ చేసిన ప్రేక్షకుల రియాక్షన్ గురించి ఆలోచించి చేస్తాను అని ఆయన పేర్కొన్నారు. ఆడియన్స్ చప్పట్లు కొడతారని ఆశించి 2 అడుగుల

 బంగి జంప్ చేశాను అని చెప్పారు. నేను మిల్కీ బ్యూటీ సాంగ్ లో మెరిసిపోతున్నానని చాలామంది చెప్పారని ఈ సందర్భంగా చిరంజీవి పేర్కొన్నారు. ఇక తమన్నాతో ఈక్వల్ గా గ్లామరస్ గా ఉన్నానని చెబుతున్నారు. నా మెరుపు ఓ కారణం ప్రేక్షకులు ఇచ్చిన ఎనర్జీ అని చిరంజీవి ఈ సందర్భంగా చెప్పకు వచ్చారు. భోళాశంకర్ సినిమాలో పవన్ కళ్యాణ్ ను ఇమిడియెట్ చేసే సన్నివేశాల్లో తనతో పాటు శ్రీముఖి కూడా నటించిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇక చాలామంది తెలుగు ప్రేక్షకులు వేదాలను సినిమాను చూడలేదు అని ఆ రీజన్ వల్లే ఈ సినిమాలో నటించానని చిరంజీవి పేర్కొన్నారు. ఇక తన మాటలతో చిరంజీవి ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: