యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవరా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించిన షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోతున్నారు. ఇక సినిమా తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్ హీరోగా వస్తున్న వార్ 2 సినిమా ద్వారా విలన్ గా కనిపించడానికి
రెడీ అవుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే గతంలోనే జై లవకుశ సినిమాలో విలన్ పాత్రలో నటించి షాప్ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందేమ్ అయితే తాజాగా ఇప్పుడు మరోసారి సినిమాలో విలన్ పాత్రలు కనిపించి ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ సినిమాలో హృతిక్ రోషన్ పాత్ర ఎంతో అద్భుతంగా ఉంటుంది.
అంతకుమించి ఎన్టీఆర్ పాత్ర కూడా ఉండబోతుందని తెలుస్తోంది. కాగా ఇందులో జూనియర్ ఎన్టీఆర్ పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపిస్తాడట. ఇలా ఎన్టీఆర్ నెగిటివ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నయి. అయితే ఈ విషయం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉంది. త్వరలోనే ఈ సినిమాలో పాల్గొనడం కోసం జూనియర్ ఎన్టీఆర్ చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నాడు అన్న విషయాన్ని ఇటీవల డైరెక్టర్ అయాన్ ముఖర్జీకి కూడా స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ తెలియజేసినట్లుగా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి..!!