Don -3 లో షారుక్ ఖాన్ బదులు మరో స్టార్ హీరో..!!
ఫర్హాన్ అత్తర్ డాన్ ప్లాన్ చేసి లో మరొక చాప్టర్ ని ఓపెన్ చేయబోతున్నారు.. అధికారికంగా డాన్ 3 సినిమా ప్రకటించారు అయితే ఈసారి షారుఖ్ ఖాన్ మాత్రమే డాన్ గా నటించడం లేదని కూడా బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. డాన్ -3 లో బాలీవుడ్ నటుడు రణవీర్ నటించబోతున్నట్లు తెలుస్తోంది.. దీంతో ఈ ఫ్రాంచేసి ముగియబోతోంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం పైన బాలీవుడ్ ఫ్యాన్స్ మాత్రం మండిపడుతున్నారు. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ ఫాన్స్ ఒక రేంజ్ లో ఫైర్ కావడం జరుగుతొంది.
షారుక్ అంటే డాన్ డాన్ అంటే షారుక్ ఆయన ప్లేస్ లో మరొక హీరో ఉన్నా కూడా డాన్ -3 ని చూడబోమంటూ ప్రతిజ్ఞ చేస్తున్నట్లు తెలుస్తోంది.. మరి డాన్ ప్లేస్ లో రణబీర్ సింగ్ అంటూ వినిపిస్తున్న మాటలు మరి అభిమానులను మండిపడేలా చేస్తున్నాయి. ఏ మేరకు ఈ వార్తలలో నిజం ఉందో తెలియదు కానీ.. ఈ విషయంపై ఈ వారంలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు బాలీవుడ్ మీడియాతో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి ఉండక తప్పదు.