రజిని... శంకర్ కాంబో బ్లాక్ బస్టర్ మూవీ రీ రిలీజ్ అప్పుడే..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో అదిరిపోయే బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అలా రజిని కెరియర్ లో అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన సినిమాలలో శివాజీ సినిమా ఒకటి. ఈ సినిమాకు దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వం వహించగా ... ఈ సినిమాలో రజిని సరసన మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని శ్రేయ హీరోయిన్ గా నటించింది.


మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయన తార ఒక స్పెషల్ సాంగ్ లో నటించగా ... సుమన్మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ కి రెహమాన్ అందించిన సంగీతం కూడా కీలక పాత్రను పోషించింది. ఇకపోతే ఈ సినిమా 2007 వ సంవత్సరం జూన్ 15 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి సూపర్ సాలిడ్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కాయి.


ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ రెండవ వారంలో భారీ ఎత్తున థియేటర్ లలో రీ రిలీజ్ చేయడానికి ఈ మూవీ మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇకపోతే ఈ మూవీ రీ రిలీజ్ కోసం ఎంతో మంది సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: