ఆ కారణంగా రాజమౌళిని ఇబ్బంది పెట్టిన రమ్యకృష్ణ....!!
నరసింహ సినిమాలో ఛాన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ హీరోయిన్ సెకండ్ హీరోయిన్ అని ఆలోచించలేదట..రజినీకాంత్ తో నటిస్తున్న సినిమా లో భాగం కావాలని మాత్రమే అనుకున్నారని తెలిపింది.. కానీ ఆ చిత్రంలో సౌందర్య ముఖం పైన కాలు పెట్టే సన్నివేశం ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అని చాలా భయపడ్డాను.బాహుబలి సినిమా మరో హిట్టు ను తెచ్చిపెట్టిందని ఆ సినిమాతో ఆ స్థాయిలో పేరు వస్తుందని అనుకోలేదని తెలిపింది. అయితే ఆ చిత్రంలో నటించడానికి కొన్ని కండిషన్లు పెట్టినట్లు తెలిపింది రమ్యకృష్ణ.
కండిషన్ల లో రాత్రిపూట షూటింగ్ చేయనని చెప్పానని అలాగే షూటింగ్ కోసం కేవలం కొన్ని రోజులు మాత్రమే డేట్స్ ఇవ్వగలరని చెప్పిందట. అయితే ఈ కండిషన్స్ కి రాజమౌళి కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.. అయితే రాజమౌళి ఒప్పుకోవడానికి ముఖ్య కారణం డైరెక్టర్ కృష్ణవంశీ మీద ఉండే అభిమానం తో పాటు కృష్ణవంశీ భార్య రమ్యకృష్ణ కూడా మేడం లాగా చూడడం తో రమ్యకృష్ణ ఎన్ని కండిషన్లు పెట్టిన ఎంత గౌరవం గా రాజమౌళి వీటికీ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే కేవలం శివగామి పాత్ర మంచి సక్సెస్ అవ్వడం తో తనకు చాలా ఆనందంగా ఉందని తెలిపింది.