సాహీరోయిన్ యి పల్లవి అంటే తెలియని వారు ఉండరు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ జనరేషన్ లో ఈ హీరోయిన్ కి లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ సాయి పల్లవికి ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె ఎటువంటి గ్లామర్ షోలో ఇప్పటివరకు చేసిందో లేదో కేవలం నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో ఒదిగిపోయి మరి నటిస్తూ ఉంటుంది. పైగా ఇప్పటి సినిమాల్లో ఏ హీరోయిన్ కూడా సాయి పల్లవి లాగా మేకప్ లేకుండా మొటిమలతో నటించిన హిస్టరీనే లేదు. ఎలాంటి లిప్ లాకర్ సన్నివేశాలు నటించకుండా ఎటువంటి వల్గర్ సన్నివేశాల్లో నటించకుండా
పద్ధతిగా ఉండే హీరోయిన్ అని ఒక పేరుని సంపాదించుకుంది సాయి పల్లవి. అందుకే సాయి పల్లవి కి లేడి పవర్ స్టార్ అనే ఒక బిరుదు కూడా ఇచ్చారు ఆమె అభిమానులు. అయితే ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ హీరోయిన్ మన తెలుగు హీరోకి ఈమె వీరాభిమాని అని అంటున్నారు. ఇక ఆ విషయాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టింది సాయి పల్లవి. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ విధంగా మాట్లాడింది.." నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పెద్ద అభిమానిని ఇంటర్ చదువుకునే రోజుల్లోనే ఆయన సినిమాలు చూసేందుకు ఒకరోజు ఇంట్లో
చెప్పకుండా థియేటర్ కి వెళ్లిపోయాను.. ఒక్కదాన్నే వెళ్లడంతో ఇంటికి వచ్చేసరికి లేట్ నైట్ అయిపోయింది.. దాంతో మా నాన్న నన్ను కొట్టాడు మాకు చెబితే మేము తీసుకు వెళ్లే వాళ్ళం కదా అని.. నన్ను మా నాన్నగారు తిట్టారు.. నాకు ఇష్టమైన హీరో కోసం నేను తీసుకున్న అదొక్కటే.. దాని తర్వాత సినిమాల్లోకి వచ్చేసాను.. దాని తర్వాత ఆయన్ని నేరుగా కలిసే అవకాశం నాకు వచ్చింది అంటూ పేర్కొంది సాయి పల్లవి.. అనంతరం ఫిదా సినిమా షూటింగ్ లోకేషన్ కు ఒకసారి పవన్ కళ్యాణ్ వచ్చారు అని.. అప్పుడే మొదటిసారి కలిసాను అని.. ఆయన ఎంతో నిజాయితీ కలిగిన వ్యక్తి.." అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి వెల్లడించింది సాయి పల్లవి..!!