తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చి మొదటి రోజే భారీ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.గురువారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి రోజు రూ.52 కోట్ల మేర కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న నేపథ్యంలో.. దీనికి తగ్గట్టుగా చాలాకాలం రజిని స్థాయికి తగినట్లు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కూడా నమోదు అవుతున్నాయి.ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ, సునీల్, తమన్నా, వసంత రవి, యోగిబాబు తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాలో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రజిని అద్భుతమైన పర్ఫామెన్స్ తో అదరగొట్టేసారని చెప్పవచ్చు. అంతేకాదు శివరాజ్ కుమార్ , మోహన్ లాల్ వంటి స్టార్లు కూడా ఈ సినిమాలో కామియో రోల్స్ పోషించడం అరుదైన విషయమని చెప్పాలి. ఇక ఈ క్రమంలోనే అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండడంతో నెల్సన్ దిలీప్ కుమార్ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ సినిమాలో బాలయ్య పాత్ర ఎలా మిస్ అయింది అనే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చాలామంది జైలర్ ఏమన్నా మల్టీ స్టారర్ చిత్రమా అని ముందు అనుకున్నారు.. కానీ రజనీకాంత్ మాత్రం స్క్రీన్ పై కనిపిస్తే చాలు ఫుల్ జోష్ ఉంటుంది అనుకొని అందుకే ఈ సినిమాను మల్టీ స్టారర్ గా తెరకెక్కించలేదు అయితే స్పెషల్ అట్రాక్షన్ కోసం శివరాజ్ కుమార్, మోహన్ లాల్ వంటి హీరోలను పెట్టాము. అయితే ముందుగా ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణని కూడా ఒక పాత్రలో నటింపజేయాలని అనుకున్నాము. కానీ అది కుదరలేదు.ఈ స్క్రిప్ట్ రాసేటప్పుడు బాలయ్య గురించి కూడా ఆలోచన వచ్చింది.కానీ స్క్రిప్ట్ పూర్తయ్యాక ఆయనను తీసుకోవాలన్న పాత్ర సరిగ్గా రాలేదు.. అందుకే ఆ పాత్రలో ఉన్న బాలయ్యని నటింప చేయడం కరెక్ట్ కాదనిపించి ఆయనను తీసుకోలేదు అంటూ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ వెల్లడించారు కానీ ఖచ్చితంగా భవిష్యత్తులో బాలయ్యతో సినిమా చేస్తానేమో అని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.