"గాండేవదార అర్జున" మూవీ ప్రమోషన్లకు హీట్ ఎక్కిస్తున్న సాక్షి వైద్య..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న అతి కొద్ది మంది నటి మనులలో సాక్షి వైద్య ఒకరు. ఈ నటి ఈ సంవత్సరం ఏప్రిల్ 28 వ తేదీన విడుదల అయినటువంటి ఏజెంట్ అనే స్టైలిష్ యాక్షన్ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం అందుకున్నప్పటికీ ఈ మూవీ లో ఈ ముద్దుగుమ్మ తన నటనతో ... అందచందాలతో ప్రేక్షకులను బాగానే అలరించింది. దానితో ఈ నటికి ఏజెంట్ మూవీ విడుదల అయిన అతి తక్కువ రోజుల్లోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందిన గాండేవదార అర్జున అనే సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కింది.
 


ఇకపోతే ఈ సినిమాను ఆగస్టు 25 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం ఈ సినిమా ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో నిర్వహిస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. దాని కోసం ఈ మూవీ మేకర్స్ ఓ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు.
 


ఈ ఈవెంట్ కు ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సాక్షా వైద్య కూడా విచ్చేసింది. ఈ ఈవెంట్ కు ఈ ముద్దు గుమ్మ పలుచటి ఎల్లో కలర్ శారీని కట్టుకొని ... అందుకు తగిన యెల్లో కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి విచ్చేసింది. ఇక ఈవెంట్ లో ఈ ముద్దు గుమ్మ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. దానితో ప్రస్తుతం ఈ ఈవెంట్ కు సంబంధించిన ఈ ముద్దు గుమ్మ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: