సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రభాస్ పై వార్తలు !

Seetha Sailaja
వరస ఫ్లాప్ లు వెంటాడుతున్నప్పటికీ ప్రభాస్ పై ఉన్న మ్యానియా ఏమాత్రం తగ్గక పోవడంతో అతడి మార్కెట్ ఏమాత్రం తగ్గలేదు సరికదా మరింత పెరుగుతోంది. సెప్టెంబర్ లో విడుదల కాబోతున్న ‘సలార్’ మూవీ ప్రభాస్ కు భారీ బ్లాక్ బష్టర్ హిట్ ఇస్తుందని అతడి అభిమానులు ఆశ పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య అతడి ఆరోగ్యం పై మళ్ళీ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న గాసిప్పులు అతడి అభిమానులకు కలవర పెడుతున్నాయి.


 ప్రభాస్ కు సమస్యగా మారిన మోకాలు నొప్పి ఇంకా పూర్తిగా నయం కాలేదు అన్న వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రతి మూడు నెలలకు ఒకసారి అమెరికాకు వెళ్ళి అక్కడ వైద్యం చేయించుకుంటున్నప్పటికీ ఈసమస్యకు పూర్తి పరిష్కారం కనపడటం లేదు అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. సమస్యకు ఆపరేషన్ మాత్రమే పరిష్కారం అని డాక్టర్స్ చెపుతున్నప్పటికీ ప్రస్తుతం ప్రభాస్ కమిట్ అయి ఉన్న సినిమాలు పూర్తి కాకుండా ప్రభాస్ ఆపరేషన్ ఆలోచనలు చేయడం లేదు అని అంటున్నారు.  



ప్రస్తుతం ప్రభాస్ ‘సలార్’ ‘ప్రాజెక్ట్ కె’ పనుల్లో బిజీగా ఉంటూ మధ్యలో మారుతి సినిమాను కూడ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ‘బాహుబలి’ మూవీ షూటింగ్ సమయంలో రోప్ ఫైట్ల సీన్స్ ఘాట్ చేస్తున్నప్పుడు ఈసమస్య వచ్చింది అని అంటారు. దేనితో ప్రభాస్ తాను నటించే సినిమాలలో వీలైనంతవరకు డాన్స్ సీన్స్ లేకుండా ప్రయత్నిస్తున్నప్పటికీ మారుతి దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలో ఏకంగా 4 పాటలకు స్టెప్స్ వేయవాల్సి ఉంది అని అంటున్నారు.


అయితే సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియనప్పటికీ ఈ గాసిప్పుల వార్తలు ప్రభాస్ అభిమానులకు విపరీతంగా టెన్షన్ పెడుతున్నాయి. ఇది ఇలా ఉంటే సెప్టెంబర్ లో విడుదల కాబోతున్న ‘సలార్’ అంచనాలకు అనుగుణంగా హిట్ అవ్వకపోతే ప్రభాస్ కెరియర్ మరింత సమస్యలలో పడే ఆస్కారం ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: