డైరెక్టర్ మెహర్ రమేష్ ఫ్లాపులకు, టీమిండియా గెలుపులకు మధ్య లింక్ ఏంటి?
2011లో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి మెహర్ రమేష్ శక్తి సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అదే సంవత్సరం చాలా సంవత్సరాల తర్వాత టీమ్ ఇండియాకు మహేంద్ర సింగ్ ధోనీ సేన వన్డేలో వరల్డ్ కప్ గెలుచుకుంది. ఇక 2013లో వెంకటేష్ తో కలిసి షాడో మూవీ తీశాడు. ఇది కూడా డిజాస్టర్ అయ్యింది. ఈ మూవీ చూసి వెంకటేష్ అభిమానులు జుట్టు పీక్కున్నారు ఇలాంటి చెత్త సినిమా ఎలా తీస్తారు అంటూ మెహర్ రమేష్ పై విరుచుకుపడ్డారు.
సరిగ్గా అదే సంవత్సరం టీమ్ ఇండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది. ఆ గెలుపుతో క్రికెట్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. మెహర్ రమేష్ ఫెయిల్ అయిన ప్రతిసారి ఇండియా గెలుస్తూ వస్తోంది. 2023లో మెహర్ రమేష్ తీసిన బోళా శంకర్ సినిమా రిలీజ్ అయింది. ఇది రిలీజ్ అయిన కొంతసేపటికే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇదే ఏడాది టీమిండియా వరల్డ్ కప్ ఆడనుంది. ఎప్పట్లాగా మెహర్ భోళా శంకర్ సినిమా ఫెయిల్ అయింది కాబట్టి టీమిండియా వరల్డ్ కప్ గెలుస్తుందా అనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.
క్రికెట్ లవర్స్ ఈ వింత విశ్లేషణలు చేస్తూ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్స్ కు తెర లేశారు. అయితే ఇలాంటి అనాలసిస్ వినడానికి మనకి నవ్వులాటగా ఉన్నా ఈసారి కూడా టీమిండియా వరల్డ్ కప్ గెలిచి రికార్డు సృష్టిస్తే మెహర్ రమేష్ దురదృష్టం టీమిండియాకి అదృష్టంగా మారుతుందని అనుకోవచ్చు. ఒకవేళ అది జరగకపోతే ఇవి రెండు యాదృచ్ఛికంగా జరిగినట్లు అర్థం చేసుకోవాలి.
ఇకపోతే ఈ డైరెక్టర్ కి 10 ఏళ్ల బ్రేక్ తరువాత మెగాస్టార్ చిరంజీవితో కలిసి సినిమా చేసే అవకాశం వచ్చింది. కానీ ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని ఇకపై సినిమాలు చేసే ఛాన్స్ కోల్పోయాడు మెహర్ రమేష్.