ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా సూపర్స్టార్ రజనీకాంత్ మానియా నడుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రజినీకాంత్ నటించిన జైలు సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఆయన అభిమానులు ఒక రేంజ్ లో ఖుషి అవుతున్నారు. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాకుండా కాసుల వర్షం కురిపిస్తుంది. తెలుగు తమిళ హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమాతో మరొకసారి సూపర్ స్టార్ రజినీకాంత్ తన నట విశ్వరూపం చూపించి మరొక బ్లాక్ బస్టర్ విజయాన్ని ఇతని ఖాతాలో వేసుకున్నారు.
యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన జైలర్ మొదటి రోజే రికార్డు స్థాయిలో కలెక్షన్స్ను రాబట్టి మొదటి రోజే దాదాపుగా 90 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది ఈ సినిమా. తాజాగా ఇప్పుడు 300 కోట్ల వరకు వసూలు చేసింది అన్న సమాచారం వినబడుతుంది. అయితే ఈ సినిమా కంటే ముందు దళపతి విజయ్ తో బీస్ట్ సినిమా చేశాడు దర్శకుడు నెల్సన్ దిలీప్. ఇక ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవడంలో విఫలం కావడంతో ఈ సినిమా పైనే తన ఆశలను పెట్టుకున్నాడు. ఊహించినట్టుగానే ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలైన మొదటి షో నుండి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోయింది.
కాగా ఈ సినిమాలో రమ్యకృష్ణ మరియు తమన్నా ఇద్దరు హీరోయిన్లుగా నటించారు. జాకీ ష్రాఫ్ మోహన్లాల్ శివరాజ్ కుమార్ సునీల్ తదితరులు కీలక పాత్రలో కనిపించరు. ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటిటి రిలీజ్ పై కొన్ని ఆసక్తికర చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే వారంలోనే జైలర్ సినిమా ఓటీటిలోకి వస్తుంది అంటూ ఈ సినిమా విడుదలైనప్పటి నుండి ప్రచారం జరుగుతుంది. అయితే జైలర్ సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయట. ఇక ఈ సినిమాని ఫెస్టివల్ కు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. తమిళనాడులో దీపావళి పండుగను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. అదే దీపావళి కానుకగా మరియు విజయదశమి కానుకగా ఈ సినిమాను ఓటీటిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!