టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాప్ దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్న రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ వచ్చేలా చేసింది రాజమౌళి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా బాహుబలి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకుని స్టార్ డైరెక్టర్గా ఎదిగాడు ఆయన. త్రిబుల్ ఆర్ సినిమాతో ఏకంగా కోట్లాదిమంది ఇండియన్ అభిమానులు ఎప్పుడు ఎప్పుడు అంటూ చూసిన ఆస్కార్ అవార్డును సైతం తీసుకోవచ్చాడు ఆయన. ఈ పద్యంలోని రాజమౌళికి సంబంధించిన
ప్రతి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ గా మారుతుంది. అయితే ఎంతో మందికి ఫేవరెట్ గా మారిన రాజమౌళికి ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే రాజమౌళికి ఫేవరెట్ హీరోయిన్ నిత్యమీనన్ అని అంటున్నారు. పేరుకి మలయాళ అమ్మాయి అయినప్పటికీ తెలుగులో చాలా సినిమాల్లో నటించిన సినిమా లు సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. ఈ నేపథ్యంలోనే రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హీరోయిన్ నిత్యామీనన్ నటన అంటే తనకి చాలా ఇష్టం అని... ఆమె చాలా నాచురల్ గా యాక్ట్ చేస్తుంది
అని చెప్పుకోవచ్చారు. దాంతోపాటు ఆమెను మీ సినిమాలో పెట్టుకునే ఛాన్స్ ఇస్తారా అంటే నో అని సమాధానం చెప్పాడు రాజమౌళి. దానికి కారణం ఆయన చూస్ చేసుకునే హీరోలు అందరూ కూడా గట్టిగా పుష్టిగా స్ట్రాంగ్ గా ఉండే హీరోస్ అని అయితే వాళ్ల మధ్య నిత్యమీనన్ సెట్ అవ్వకపోవచ్చు అని ఒక సందేహాన్ని ఆయన వ్యక్తం చేశారు. డైరెక్ట్ గా చెప్పాలి అంటే నిత్యమీనన్ పొట్టిగా ఉంటుంది అని అందుకే రాజమౌళి తన సినిమాలో తీసుకోవడం లేదు అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈ విషయాన్ని ఆయన చెప్పకుండా పరోక్షంగా ఇలా చెప్పడంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!