షూటింగ్ దశలోనే 'దేవర' నిర్మాతకి రూ.20 కోట్లు నష్టం.. అంతా అతని వల్లేనట?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆస్కార్ విన్నింగ్ మూవీ 'ఆర్ఆర్ఆర్' తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ఇది. అందుకే దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సీనియర్ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.
అలానే బాలీవుడ్ స్టార్ ali KHAN' target='_blank' title='సైఫ్ అలీ ఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">సైఫ్ అలీ ఖాన్ ' దేవర ' సినిమా లో విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాకి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో దేవర సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. ఆ విషయం ఏంటంటే దేవర సినిమాకు షూటింగ్ దశలోనే రూ. 20 కోట్ల వరకూ నష్టం వచ్చిందని సమాచారం. ఆ నష్టానికి కారణం ఎన్టీఆర్‌యేనని తెలుస్తుంది. దేవర సినిమా షూటింగ్ మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు జెట్ స్పీడ్ లో షెడ్యూల్ మీద షెడ్యూల్ పూర్తి చేసారు.
ఇప్పటికే 5 షెడ్యూల్స్ పూర్తి అయ్యాయి. అయితే ఎన్టీఆర్ రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన రషేస్ చూసాడట. అది చూసినా తరువాత నుంచి ఆయన సినిమా ఔట్‌పుట్ మీద కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. నాలుగవ షెడ్యూల్ లో విలన్ గా నటిస్తున్న ali KHAN' target='_blank' title='సైఫ్ అలీ ఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">సైఫ్ అలీ ఖాన్, ఎన్టీఆర్ల మీద క్లైమాక్స్ సీన్ చిత్రీకరించారట . అయితే ఈ సన్నివేశం ఎన్టీఆర్ కి అసలు నచ్చలేదట. దేవర సినిమా అనేది పాన్ ఇండియా మూవీ కాబట్టి ఇండియా వైడ్ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకొని సినిమా తీస్తే బాగుంటుంది, లేదంటే సినిమా విజయం సాధించడం కష్టమే అని ఎన్టీఆర్ అభిప్రాయం వ్యక్తం చేసారట.
అయితే కేవలం క్లైమాక్స్ సీన్స్ ఒకటే కాకుండా ఇంకొన్ని సన్నివేషాలు కూడా ఎన్టీఆర్ కి పెద్దగా నచ్చలేదట. అందుకే దేవర సినిమాని రీ షూట్ చేయమని కొరటాల శివ కి సలహా ఇచ్చాడట ఎన్టీఆర్. ఇప్పటివరకు జరిగిన షూట్ కోసం దాదాపు 20 కోట్లు ఖర్చు అయింది. ఇప్పుడు రీషూట్ చెయ్యాలంటే 20 కోట్లు నష్టపోక తప్పదని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అసలు ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉంది అనేది మాత్రం తెలీదు.