ధనుష్ తో నటించే అవకాశం కొట్టేసిన రష్మిక..!!
ఇప్పటికే ధనుష్ డైరెక్ట్ గా తెలుగు ఫిలిం సార్ సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు.ఇప్పుడు రెండవసారి తెలుగులో మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈసారి భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభించాల్సి ఉండగా కొన్ని కారణాల చేత సెట్లోకి వెళ్లేందుకు లేట్ అవుతోంది. శ్రీ నారాయణ్ దాస్ నారాయణ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమా బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు.
ఇందులో హీరోయిన్ గా నటించేందుకు రష్మిక ఎంపిక చేసినట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. డైరెక్టర్ శేఖర్ కమ్ముల ధనుష్ కాంబినేషన్లో సినిమా రాబోతోందని తెలిసి ఈ సినిమా పైన అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ చిత్రం పైన మంచి బజ్ ఏర్పడుతోంది. అంతేకాకుండా ఇందులో నాగార్జున కూడా కీలకమైన పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.. మరి ఈ విషయం పైన అధికారికంగా ఇంకా ప్రకటన రావాల్సి ఉన్నది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ఒక ట్విట్ వైరల్ గా మారుతోంది.