రామ్ చరణ్ ని చంపేస్తా.. షాకింగ్ కామెంట్స్ చేసిన కాజల్..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లుగా తమ కంటూ ఆమె ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న రాంచరణ్ మరియు కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే 'మగధీర', 'నాయక్', 'గోవిందుడు అందరివాడే' వంటి సినిమాలు వచ్చాయి. 'మెరుపు' అనే సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలు కూడా ప్రారంభమై ఆ మధ్యలోని ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇక మూడు సినిమాల్లో కలిసి నటిస్తే ఏ హీరో హీరోయిన్ కైనా మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. కానీ కాజల్ అగర్వాల్ మాత్రం రామ్ చరణ్ అవకాశం వస్తే చంపేస్తాను.. చంపేయాలి అన్నంత కోపం ఉంది అంటూ ఒకానొక సందర్భంలో తెలిపింది. 


దీంతో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక అసలు విషయం ఏంటంటే.. చాలామంది హీరో హీరోయిన్లు కొన్ని ఇంటర్వ్యూలో పాల్గొంటూ ఉంటారు.. అందులో భాగంగానే యాంకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ అడ్డంగా బుక్ అవుతారు. అయితే ఇలా ఇప్పటికీ చాలామంది నటీనటులు వారు మాట్లాడిన మాటలతో ట్రోలింగ్స్ కి గురైన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాగే చాలా వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉంటారు.  అలాంటి విషయం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం.. కాజల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది.


అయితే ఆమె ఇంటర్వ్యూలో భాగంగా రాపిడ్ ఫెయిర్ లో పాల్గొన్నప్పుడు యాంకర్ మీకు ఛాన్స్ వస్తే ఇండస్ట్రీలో ఏ హీరోని చంపేస్తారు అని అడుగుతుంది. అనంతరం ఏ హీరోతో లేచిపోతారు.. ఏ హీరోని పెళ్లి చేసుకుంటారు అని అడిగింది..ఇక అందుకు కాజల్ సమాధానం ఇస్తుంది.. "నేను ఎన్టీఆర్ తో లేచిపోయి.. ప్రభాస్ ని వివాహం చేసుకుంటాను అని.. అలాగే అవకాశం వస్తే రాంచరణ్ చంపేస్తాను అంటూ చెప్పుకొచ్చింది." దీంతో తాజాగా ఆ వీడియో కాస్త వైరల్ అవ్వడంతో పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు కాజల్ పై ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: