విజయ్ దేవరకొండ కొత్త మూవీలో మరొక స్టార్ హీరోయిన్.. ఎవరంటే.. !?

Anilkumar
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ మరియు పరశురాం కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందని అంటున్నారు. కాగా సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక ఆ సినిమాకి ఫ్యామిలీ స్టార్ అనే పేరు దాదాపుగా ఖరారు అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒక హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ ని ఇప్పటికే అనౌన్స్ చేశారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే మరొక హీరోయిన్ కి సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే సెకండ్ హీరోయిన్ ప్లేస్ లోకి దివ్యాంశ కౌశిక్ ను ఫిక్స్ చేశారట మెకర్స్. 

మజిలీ సినిమా తో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది దివ్యాంశ కౌశిక్. రామారావు ఆన్ డ్యూటీ మై ఖేల్ వంటి సినిమాల్లో సైతం నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలటక్కర్ సినిమాలో సిద్ధార్థ తో కూడా కలిసి నటించింది ఈ హీరోయిన్. అయితే ఈ సినిమాలన్నీ కూడా దాదాపుగా ఫెయిల్ అయ్యాయి. అయినప్పటికీ గ్లామర్ పరంగా మాత్రం ఈమెకి మంచి మార్కులే పడ్డాయి. తాజాగా ఇప్పుడు విజయ్ దేవరకొండ సరసన ఈ  సినిమాలో ఛాన్స్ అందుకుంది దివ్యాంశ కౌశిక్. దాంతోపాటు కిక్ శ్యామ్ కి సైతం ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించే అవకాశం వచ్చిందని అంటున్నారు.

అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సోదరుడుగా ఆయన కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ హైదరాబాదులో జరుగుతోందట. ఇక ఈ నెల చివరిలో చిత్ర బృందం కొన్ని షాట్స్ కోసం అమెరికా కూడా వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక అక్కడ మరొక భారీ షెడ్యూల్ ని కూడా చిత్రీకరించబోతున్నారట. దాంతో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. 2024 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఖుషి సినిమా తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: