టాలీవుడ్ హీరో కార్తికేయ హీరోయిన్ నేహా శెట్టి జంటగా నటిస్తున్న తాజా చిత్రం బెదురులంక 2012 ఈ సినిమా 2012 యుగాంతరం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ క్లాక్ దర్శకత్వం వహించారు.. ఈ సినిమా ఈ నెల 25 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.. గడిచిన కొద్ది రోజుల క్రితం ఈ సినిమా టీజర్ విడుదల అవ్వగా ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ఈ రోజున రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు.. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు హీరో రామ్ చరణ్ చేతుల మీదుగా బెదురులంక 2012 సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నారు..
అందుకు సంబంధించి ఒక పోస్టర్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది చిత్రం బృందం. ఇప్పటికీ విడుదలైన ద వరల్డ్ ఆఫ్ బెదురులంక గ్లింప్స్ , పాటలకు కూడా అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా గోదావరి బెస్ట్ రూరల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.. ఇందులో అజయ్ గోస్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యర్ తదితరుల సహిత ముఖ్యమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు.. సంగీతాన్ని మణిశర్మ అందిస్తూ ఉన్నారు.. కార్తికేయ 2021 లో వచ్చిన రాజా విక్రమార్క సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలింది.
కార్తికేయ కు సరైన సక్సెస్ లేక ఇప్పటికి చాలా కాలం అవుతోంది.. దీంతో కొన్ని సినిమాలలో విలన్ గా కూడా నటించి మెప్పించారు.. అయితే ఈసారి కచ్చితంగా హీరోగా సక్సెస్ అవ్వాలని బెదురులంక 2012 సినిమా పైన భారీ అంచనాలు పెట్టుకొని నటిస్తూ ఉన్నారు. మరి ఈ సినిమాతో నైనా ఈ హీరో కెరియర్ మారుతుందేమో చూడాలి మరి. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ మాత్రం ఈ రోజున చాలా గ్రాండ్గా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.