ఆ హీరోయిన్.. చిరుతో ఒక్క సినిమా చేయలేదట.. అవకాశం వచ్చిన రిజెక్ట్ చేసిందట?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శివ శంకర్ వరప్రసాద్ తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులందరికీ మెగాస్టార్ గా మారిపోయాడు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ అనే ఒక పుస్తకంలో తనకంటూ ప్రత్యేకమైన పేజీలు లికించుకున్నాడు. దాదాపు మూడు దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగిన మెగాస్టార్.. ఇక ఇప్పుడు 60 ఏళ్ల వయసులో కూడా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు అని చెప్పాలి.


 తన డాన్సులు నటనతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండుకు నాంది పలికాడు చిరంజీవి. ఈ క్రమంలోనే తన కెరీర్ లో ఎన్నో ఇండస్ట్రీ హిట్లను కూడా సాధించాడు అన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 150కి పైగా సినిమాలు చేసిన చిరంజీవి.. ఇక ఇండస్ట్రీలో ఉన్న నిన్నటి తరం నేటితరం హీరోయిన్లలో ఆల్మోస్ట్ అందరితో కలిసి నటించారు. అలాంటి చిరంజీవి ఒక్క హీరోయిన్తో మాత్రం ఇప్పుడు వరకు స్క్రీన్ షేర్ చేసుకోలేకపోయాడట. అయితే చిరంజీవి సినిమాలకు సంబంధించిన ఆఫర్లు వచ్చినప్పటికీ సదరు హీరోయిన్ ఎందుకో తిరస్కరిస్తూ వచ్చిందట.



 అయితే దీని వెనుక పెద్ద కారణమే ఉందట. చిరంజీవి ఆ హీరోయిన్ కు ఇష్టం లేని మరో హీరోయిన్ తో క్లోజ్ గా ఉండడం వల్లే చిరంజీవి సినిమాలకు ఆ హీరోయిన్ ఒప్పుకోలేదట. తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి రాధిక జోడి కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక అప్పట్లో వీరి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇక రాధిక, చిరంజీవి మధ్య మంచి సన్నిహిత్యం కూడా ఏర్పడింది. అయితే చిరంజీవి ఇలా రాధికతో క్లోజ్ గా ఉండడంతో  చిరంజీవి సినిమా అవకాశాలు మొత్తం రిజెక్ట్ చేస్తూ వచ్చిందట ఆ నటి.  కానీ ఆ తర్వాత ఆవేశంలో చేసిన పని కెరియర్ నాశనం చేసిందంటూ ఇక ఇప్పటికి కూడా ఆ హీరోయిన్ బాధపడుతూనే ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: