మణిశర్మ వారసత్వాన్ని కొనసాగించలేకపోతున్న మహతి సాగర్ !

Seetha Sailaja
రెండు దశాబ్ధాల పాటు ఫిలిమ్ ఇండస్ట్రీని మెలోడీ బ్రహ్మగా శాసించిన మణిశర్మ ఆతరువాత కాలంలో దేవిశ్రీ ప్రసాద్ తమన్ ల హవా ప్రారంభం అయ్యాక మణిశర్మ మ్యానియా నెమ్మదిగా తగ్గిపోయింది.  హీరోలకు వారసులు వస్తున్నట్లుగా సంగీత దర్శకులకు అదే కుటుంబం నుండి వారసులు వస్తున్నప్పటికీ వారు పెద్దగా రాణించలేకపోతున్నారు. ఇప్పుడు ఈ లిస్టులో మణిశర్మ కొడుకు మహతి సాగర్ కూడ చెరిపోయాడా అన్నసందేహాలు చాలామందికి వస్తున్నాయి.



చిరంజీవికి మణిశర్మ పట్ల ఉండే అభిమానంతో అతడి కొడుకుకి ‘భోళా శంకర్’ ఆఫర్ వచ్చింది. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ మహతి సాగర్ ట్యూన్ చేసిన పాటలు కూడ కనీసపు స్థాయిలో లేకపోవడంతో చిరంజీవి అభిమానులు కూడ పెదవి విరుస్తున్నారు. ఈమూవీలో చిరంజీవి ఎంత హుషారుగా డాన్స్ చేసినా పాటల ట్యూన్స్ ఏమాత్రం బాగుండక పోవడంతో సినిమా బాగుండక పోయినా కనీసం పాటలు అయినా బాగాలేదు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.



మహతి సాగర్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉంటే టాప్ హీరోల సినిమాలలో అతడికి అవకాశాలు వచ్చి ఉండేవి అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇళయరాజా వారసుడిగా యువన్ శంకర్ రాజా రెండు దశాబ్దాలుగా ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉన్నాడు. అతడి స్థాయిలో మహతి సాగర్ ఎదుగుతాడని మణిశర్మ అభిమానులు ఆశిస్తున్నారు.



గతంలో సాలూరి రాజేశ్వరావు వారసుడుగా కోటి ఎంతో పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే హీరోల కొడుకులు వారసులుగా రాణించినంత సులువుగా సంగీత దర్శకుల కొడుకులు మ్యూజిక్ డైరెక్టర్స్ గా రాణించడం చాలకష్టమైన పని ముఖ్యంగా నేటితరం ప్రేక్ష్లకులకు  ఎలాంటి ట్యూన్స్ ఇస్తే నచ్చుతాయో తెలియని పరిస్థితులలో మహతి సాగర్ కు ఎంత మణిశర్మ బ్యాకింగ్ ఉన్నప్పటికీ తన ప్రతిభ చూపెట్టలేకపోతే అవకాశాలు ఇవ్వరు. అయితే ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కు ఇంకా భవిష్యత్ చాల ఉంది కాబట్టి రానున్నరోజులలో అతడు గొప్ప సంగీత దర్శకుడు అవుతాడని మణిశర్మ అభిమానులు ఆశిస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: