2023 లో టాలీవుడ్ లో భారీ నష్టాల్ని మిగిల్చిన చిత్రాలు..!!
ముందుగా మెహర్ రమేష్, చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన భోళా శంకర్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైన ఘోరమైన డిజాస్టర్ ని మూట కట్టుకుంది.. దాదాపుగా ఈ సినిమా రూ .52 కోట్ల రూపాయలు నష్టాన్ని మిగిల్చింది.. ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కించిన అది పురుష్ సినిమా కూడా భారీ అంచనాల మధ్య విడుదల అవ్వగా ఈ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలింది.. రూ.50 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది.. సమంత మయోసైటీస్ తర్వాత భారీ అంచనాల మధ్య పీరియాడికల్ డ్రామా సినిమాలో నటించింది ఆ సినిమానే శాకుంతలం .. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గుణశేఖర్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ సినిమా కూడా రూ .50 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది.
డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటించిన చిత్రం ఏజెంట్ ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కించారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాగా ఘోరమైన డిజాస్టర్ ని మూట కట్టుకుంది దాదాపుగా రూ .33 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. ఇక పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా.. నటుడు డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వహించారు.. ఈ సినిమా కూడా భారీ అంచనాల మధ్య విడుదల కాగా ఈ సినిమా రూ .31 కోట్ల రూపాయలు నష్టాన్ని మిగిల్చింది.