కొరటాల పై సానుభూతిని పెంచిన భోళాశంకర్ !
గత సంవత్సరం ‘ఆచార్య’ విడుదలై ఆమూవీ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో చాలామంది కొరటాల ను విమర్శించారు. ఏకంగా ఈమూవీలో నటించిన చిరంజీవి కూడ కొరటాలను పరోక్షంగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడంతో అప్పట్లో కొరటాల పరిస్థితి అయోమయంగా మారిపోయింది. అలాంటి చిరంజీవి ‘భోళాశంకర్’ ఫెయిల్ అయినప్పటికీ దర్శకుడు మెహర్ రమేష్ ను ఒక్క మాట కూడ అనకుండా మౌనంగా ఉండటంతో సినిమా ఫెయిల్యూర్ లో కొరటాలకు ఒక న్యాయం మెహర్ రమేష్ కు ఒక న్యాయం ఉంటుందా అంటూ కొరటాల అభిమానులు చిరంజీవిని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
వాస్తవానికి ‘భోళాశంకర్’ విడుదలకు ముందు చిరంజీవి మెహర్ రమేష్ ను ఆకాశంలోకి ఎత్తెస్తూ ఆసినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అంటూ అంచనాలు పెంచేశాడు. అయితే ఆసినిమా విడుదల అయిన తరువాత ఆసినిమాను చూసిన సగటు ప్రేక్షకుడు తలలు పట్టుకుంటూ పాత చింతకాయ పచ్చడిలా ఉంది అంటూ ఇలాంటి చెత్త సినిమాలలో చిరంజీవి లాంటి గొప్ప నటుడు నటించడం ఏమిటి అంటూ ప్రశ్నలు వేస్తున్నారు.
కీర్తి సురేష్ లాంటి గొప్ప నటి చెల్లెలుగా నటించినా చిరంజీవి మ్యానియా ఈసినిమా పై ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయాయి. దీనితో ఈసినిమా బయ్యర్లకు 50 శాతం పైగా నష్టాలు వచ్చాయి అన్న ప్రచారం జరుగుతోంది. ఈ ఫ్లాప్ గురించి ఒక్క మాట కూడ మాట్లాడకుండా దర్శకుడు మెహర్ రమేష్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన తీరు గమనించిన వారు ఇలాంటి సినిమాను నిర్మాత ఎందుకు నిర్మించాడు అంటూ కొందరు సాను భూతి వ్యక్త పరుస్తున్నారు. టేకింగ్ విషయాయంలో కాని పాటల విషయంలో కాని స్క్రీన్ ప్లే విషయాయంలో కాని ఇలా ఏవిషయంలోనూ కొత్తదనం లేకపోవడంతో ఈమూవీ ఘోరమైన ఫ్లాప్ గా మారిన విషయం అందరికీ తెలిసిందే..