"భోళా శంకర్" మూవీ కి 5 రోజుల్లో వచ్చిన కలెక్షన్లు ఇవే..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 11 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఐదు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ ఐదు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రోజు వారిగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

భోళా శంకర్ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 18.38 కోట్ల షేర్ 28 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ సినిమా రెండవ రోజు ప్రపంచ వ్యాప్తంగా 3.60 కోట్ల షేర్ 6.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేస్తుంది.

ఈ సినిమా 3 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 3.38 కోట్ల షేర్ 5.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేస్తుంది.

ఈ సినిమా 4 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 40 లక్షల షేర్ 80 లక్షల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేస్తుంది.

ఈ సినిమా 5 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.28 కోట్ల షేర్ 2.05 గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేస్తుంది.

5 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 26.94 కోట్ల షేర్ ... 42.94 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఇకపోతే ఈ సినిమాకు 79.60 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... 80.50 కోట్ల టార్గెట్ తో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ బారి లోకి దిగింది. ఈ మూవీ మరో 53.56 కోట్ల షేర్ కలక్షన్ లను సాధించినట్లు అయితే హిట్ స్టేటస్ ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: