ఎన్టీఆర్ ను మిస్ చేసుకున్న గోపీచంద్ హీరోయిన్....!!
2007లో కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘చందమామ’ సినిమాలో కామ్నా నటించాల్సిందట. చందమామలో కాజల్ అగర్వాల్, సింధు మీనన్ హీరోయిన్స్ గా నటించారు. వీరిలో ఒక పాత్ర కోసం కృష్ణవంశీ కామ్నాని సంప్రదించి కథ కూడా వినిపించాడట. కామ్నాకి కథ కూడా నచ్చింది. కానీ కృష్ణవంశీ అడిగిన డేట్స్ లో ఆమెకు ఖాళీ లేదు. అయితే కామ్నాకు కథ బాగా నచ్చడంతో డేట్స్ మార్చుకోమని కృష్ణవంశీని చాలా రిక్వెస్ట్ చేసిందట. కానీ కుదరకపోవడంతో కృష్ణవంశీ మరో హీరోయిన్ తో సినిమా పూర్తి చేసేశాడు.
ఇక అలాగే ఎన్టీఆర్ తో కూడా ఒక సినిమా మిస్ చేసుకుందట. కానీ ఆ సినిమా ఏంటనేది మాత్రం కామ్నా తెలియజేయలేదు. అయితే ఆ మూవీ ‘అదుర్స్’ అని తెలుస్తుంది. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నయనతార, షీలా హీరోయిన్స్ గా నటించారు. షీలా పాత్ర కోసం కామ్నాని సంప్రదించినట్లు తెలుస్తుంది. ఒకవేళ ఈ రెండు సినిమాలు ఈ హీరోయిన్ కి పడి ఉంటే.. ఈ అమ్మడు కెరీర్ మరోలా ఉండేది. ఇక పెళ్లి తరువాత అడపాదడపా సినిమాలు, వెబ్ సిరీస్ లలో కనిపిస్తూ వస్తుంది కామ్నా జెత్మలాని. ఇటీవలే వ్యవస్థ అనే సిరీస్ తో చాలా ఏళ్ళ తర్వాత తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది జెత్మలాని.