ఓటీటీలో అప్పటి నుండి స్ట్రీమింగ్ కానున్న 'బేబీ' మూవీ....!!

murali krishna
చిన్న సినిమా గా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న బేబీ సినిమా గురించి ఇంకా ఎక్కడో ఒక చోట చర్చ జరుగుతూనే ఉంది. కొబ్బరిమట్ట, హృదయ కాలేయం సినిమాల దర్శకుడు సాయి రాజేష్ దర్శకత్వం లో ఆనంద్ దేవరకొండ హీరో గా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా బేబీ తెరకెక్కింది.

ఈ సినిమా లో విరాజ్ అశ్విన్ కీలక పాత్ర లో నటించ గా ఈ సినిమా దాదాపు 90 కోట్ల దాకా వసూళ్లు రాబట్టుకుంది. ఇక ఇతర సినిమాల ఎంట్రీ తో వసూళ్ళ లో బ్రేక్ పడడం తో ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. ఇక ఎట్టకేలకు ‘బేబీ’ సినిమా ఓటీటీ అప్డేట్ వచ్చేసింది. ‘బేబీ’ మూవీ తమ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు ‘ఆహా’ సోషల్ మీడియా లో ప్రకటించింది.

రేపు ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటిస్తామని తెలిపింది. నిజాని కి రేపటి నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరిగినా ఇప్పుడు ఆహా ప్రకటన తో ఈ సినిమా వచ్చే శుక్రవారం అంటే ఆగస్టు 25న రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా రెండు గంటల 55 నిమిషాల వరకు నిడివి ఉండగా మరొక వర్షన్ థియేటర్ల లో రిలీజ్ చేశారు కూడా. ఈ సినిమా నాలుగు గంటల కట్ ఓటీటీ లో రిలీజ్ చేయబోతు న్నారని అంటున్నారు. ఇక ఈ వెర్షన్లో ఒక ఎక్స్ట్రా సాంగ్ తో పాటు కొన్ని విన సొంపైన ట్రాక్స్ కూడా ఉన్నాయని, ఆనంద్ చేత డ్యాన్స్ చేయించిన సాంగ్ అదిరి పోయిందని అంటున్నారు. ఇక మొత్తం మీద ఈ సినిమా ఓటీటీ ప్రకటన అయితే చాలా మంది అభిమాను ల్లో మంచి జోష్ తెచ్చిపెట్టిందని చెప్పచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: