హర్రర్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్న మెగాస్టార్.. పోస్టర్ వైరల్..!!
ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా ఒక హర్రర్ త్రిల్లర్ చిత్రానికి శ్రీకారం చుట్టడం జరిగింది.. మమ్ముట్టి నటించబోతున్న ఒక కొత్త సినిమా చాలా గ్రాండ్ గా ప్రారంభమయ్యింది.. భ్రమయుగం అనే టైటిల్ తో ఈ సినిమా రాబోతోంది.రిలీజ్ చేసిన ఒక పోస్టర్ అందరిని ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది.. ఇందులో ఒక పెద్ద ఇల్లు దాని ముందు ఒక వ్యక్తి చేతిలో కాగడ పట్టుకొని నిలుస్తూ ఉన్నట్లుగా ఈ పోస్టర్లు చూపించడం జరిగింది. అయితే ఇంటి వెనకాల కొండలు ఆ పైనే భూతాల లాంటి వ్యక్తులు కనిపించడంతో ఈ సినిమా పైన మరింత ఆసక్తి నెలకొంటోంది..
ఈ చిత్రాన్ని రాహుల్ సిసింద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అర్జున్ అశోక్ ,సిద్ధార్థ భరత్, తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు.. ఇకపోతే మమ్ముట్టి ఈ సినిమాతో పాటు మరికొన్ని చిత్రాలలో కూడా నటిస్తూ ఉన్నారు వాటిలో గ్రీన్ థ్రిల్లర్గా తెరకేకిస్తున్న బజూక కూడా ఒకటి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ డినో డేన్నిస్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు ఈ చిత్రం పైన మంచి బస్ ఏర్పడుతోంది ఇందులో గౌతమ్ మీనన్, సిద్ధార్థ భరతన్, టౌమ్ చైన్ చాకో తదితరుల సైతం కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.