అందాల ముద్దు గుమ్మ నందిత శ్వేత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీ తో మంచి గుర్తింపును ... మంచి విజయాన్ని అందుకుంది . ఈ మూవీ తర్వాత ఈ నటికి తెలుగు లో అనేక సినిమాల్లో అవకాశాలు లభించాయి . అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమాలలో నటించిన ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది.
ఇకపోతే తాజాగా ఈ ముద్దు గుమ్మ అశ్విన్ బాబు హీరో గా రూపొందిన హిడింబా అనే సినిమా లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో ఈమె పవర్ఫుల్ అండ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇక పోతే ఈ మూవీ లో ఈ నటి తన నటనతో మాత్రమే కాకుండా తన అంద చందాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది . ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను భాగానే అలరించింది. తాజాగా ఈ మూవీ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈ మూవీ "ఓ టి టి" ప్రేక్షకులను కూడా బాగానే అలరిస్తోంది.
సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ నటి ఎప్పటి కప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా నందిత తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం నందిత కు సంబంధించిన ఈ స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.