ఆనంద్ దేవరకొండ ... విరాజ్ ... వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలలో బేబీ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సాయి రాజేష్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితమే ధియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ థియేటర్ లలో విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమాకు సూపర్ సాలిడ్ కలెక్షన్ లు లాంగ్ రన్ లో లభించాయి. దానితో ఈ మూవీ కి భారీ లాభాలు కూడా వచ్చాయి. ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకున్న ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇకపోతే తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.
ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి ఆహా సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని ఆగస్టు 15 వ తేదీ నుండి ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ సంస్థ తాజాగా ప్రకటించింది. అలాగే ఎవరైతే ఆహా గోల్డ్ మెంబర్షిప్ కస్టమర్స్ ఉంటారో వారికి ఈ సినిమాను 12 గంటల ముందు నుండే స్ట్రీమింగ్ చేసే వెసులు బాటను కూడా కల్పించినట్లు ఆహా ప్లాట్ ఫామ్ వారు ప్రకటించారు. మరి ఇప్పటికే థియేటర్ లలో అద్భుతమైన విజయం సాధించి భారీ కలక్షన్ లను అందుకున్న ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.